మూడో రోజూ రూపాయి రయ్‌

30 Apr, 2020 06:32 IST|Sakshi

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం 52 పైసలు పుంజుకొని రూ.75.66 వద్ద ముగిసింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై నిర్ణయం నేపథ్యంలో విదేశీ కరెన్సీలతో పోల్చితే డాలర్‌ బలహీనపడటం, మన స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాలు సాధించడం, వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ దశలవారీగా తొలగనుండటం  దీనికి కారణాలు. గత మూడు రోజుల్లో రూపాయి 80 పైసలు(దాదాపు 1 శాతం మేర) బలపడింది. నెల గరిష్ట స్థాయికి చేరింది.   మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 76.18 వద్ద ముగిసింది. బుధవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 34 పైసల లాభంతో 75.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.60–75.96 గరిష్ట–కనిష్ట స్థాయిల మధ్య కదలాడింది. చివరకు 52 పైసల లాభంతో 75.66 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు