కరోనా ఎఫెక్ట్‌ : 41వేల దిగువకు సెన్సెక్స్‌

28 Jan, 2020 14:31 IST|Sakshi

సాక్షి, ముంబై :    ప్రపంచ దేశాలను వణికిస్తున్న  కరోనావైరస్‌ స్టాక్‌మార్కెట్లను కూడా భయపడుతోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో లాభాలతో ఉన్నా, ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 40998 వద్ద  41వేల స్థాయి దిగువకు చేరింది.  నిఫ్టీ 59  పాయింట్ల నష్టంతో 12060  వద్ద ఉంది. బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు పాజిటివ్‌గా ఉండగా.. మెటల్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఎదురవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ, సన్ ఫార్మా, బీపీసీఎల్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. వేదాంత, భారతి ఎయిర్టెల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు