42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత

27 May, 2020 08:41 IST|Sakshi
ఫైల్ ఫోటో

సాక్షి, చెన్నై : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లోని ప్లాంట్‌ లో కార్యకలాపాలను నిలిపివేసినట్టు మంగళవారం ప్రకటించింది. తమ కర్మాగారంలోని సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో  ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఎంతమంది కార్మికులు వైరస్ బారిన పడ్డారనేది నోకియా వెల్లడించలేదు. మరోవైపు కనీసం 42 మందికి కరోనా సోకిందనే వాదన వినిపిస్తోంది.

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో సంబంధిత నిబంధనల ప్రకారం ఇటీవల ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించామని, భౌతిక దూరం, క్యాంటీన్ లో మార్పులు లాంటి  నిబంధనలను పాటిస్తున్నామని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే  తాజా పరిణామం నేపథ్యంలో పరిమిత సిబ్బందితో త్వరలోనే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని ఆశిస్తున్నామని చెప్పింది.

కాగా  చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ  ఒప్పో కూడా ఇటీవల తిరిగి ప్రారంభించిన ఢిల్లీ శివార్లలోని ప్లాంట్ ను మూసివేసింది. తొమ్మిది మందికి కరోనా సోకడంతో  ప్లాంట్‌లో కార్యకలాపాలను గత వారం నిలిపివేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు