ఆకట్టుకోని సంకల్ప్‌ పత్ర : నష్టాల ముగింపు

8 Apr, 2019 15:56 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో 100పాయింట్లకు పైగా లాభసడిన కీలక సూచీల్లో బీజేపీ మానిఫెస్టో ప్రకటన అనంతరం  ఒక్కసారిగా అమ్మకాల వెల్లువ కురిసింది.  ఒక దశలో డే హైనుంచి మార్కెట్లు 400 పాయింట్ల పతనాన్ని నమోదు  చేసింది.   ట్రేడర్ల అమ్మకాలతో తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతూ చివరికి  సెన్సెక్స్‌ 162 పాయింట్ల నష్టంతో 38700వద్ద,  నిఫ్టీ 61 పాయింట్లు నీరసించి 11604 వద్ద స్థిరంగా ముగిసాయి.  ఒక‍్క ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. 

హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ తదితర ఐటీ షేర్లన్నీ లాభపడగా, వేదాంతా, ఎస్‌బ్యాంకు, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, హీరోమోటో కార్ప్‌, ఎస్‌బీఐ, సిప్లా, టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు డాలరు మారకంలో రుపీ  సోమవారం మరింత బలహీనపడింది. 69.66 వద్ద కొనసాగుతోంది. 

కాగా సంకల్ప్‌ పత్ర్‌పేరుతో సోమవారం బీజేపీ విడుదల చేసిన మానిఫెస్టోలో ఉగ్రవాదాన్ని ఏవిధంగానూ సహించబోమని బీజేపీ స్పష్టం చేసింది. రైతులకు వడ్డీ లేకుండా రూ. లక్ష వరకూ కొత్తగా వ్యవసాయ రుణాలు అందించనున్నట్లు తెలియజేసింది. మౌలిక రంగంపై రానున్న ఐదేళ్లలో రూ. 100 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు వివరించింది. రైతులందరికీ వ్యవసాయ ఆదాయ పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చింది.  అలాగే రామమందిరాన్ని వీలైనంత త్వరగా నిర్మిస్తామని  తన మానిఫెస్టోలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు