బలహీనంగా స్టాక్‌మార్కెట్లు

27 Nov, 2018 09:26 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా  ప్రారంభమైనాయి.   అనంతరం మరింత  క్షీణించాయి. సెన్సెక్స్‌ 42పాయింట్లు నీరసించి 35311 వద్ద,నిప్టీ 16 పాయింట్లు నష‍్టంతో 10613 వద్ద కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ 10600కు పైన స్థిరంగా ఉండటం విశేషం.

వేదాంత, జెఎస్‌ డబ్ల్యూ స్టీల్‌, జీ, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. ఎస్‌బ్యాంకు, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మ,  టెక్‌మహీంద్ర,డారెడ్డీస్‌ లాభపడుతున్నాయి.
మరోవైపు దేశీయ కరెన్సీ వరుస లాభాల అనంతరం మంగళవారం  వెనక్కి తగ్గింది. డాలరుమారకంలో  32పైసలు నష్టంతో మళ్లీ 71 స్థాయికి పతనమైంది.
 

>
మరిన్ని వార్తలు