ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్‌

2 May, 2020 05:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా తరుణ్‌ బజాజ్‌ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థ కరోనా తీవ్ర ప్రభావంలో ఉన్న నేపథ్యంలో తరుణ్‌ బజాజ్‌ ఈ బాధ్యతలు చేపట్టారు. ఇంతక్రితం ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. గురువారం పదవీ విరమణ చేసిన అతను చక్రవర్తి స్థానంలో తరుణ్‌ బజాజ్‌ నియమితులయ్యారు. ఆర్థిక శాఖతో ఆయనకు పూర్వ అనుభవం ఉంది. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన బజాజ్, 2015లో ప్రధాని కార్యాలయంలో చేరడానికి ముందు ఆర్థిక వ్యవహారాల శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు.

మరిన్ని వార్తలు