భారీ లాభాల్లో సెయిల్‌

11 Nov, 2023 04:55 IST|Sakshi

క్యూ2లో రూ. 1,306 కోట్లు

న్యూఢిల్లీ: మెటల్‌ రంగ ప్రభుత్వ దిగ్గజం స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌లో నష్టాలను వీడి రూ. 1,306 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది.

గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 329 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 26,642 కోట్ల నుంచి రూ. 29,858 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 27,201 కోట్ల నుంచి రూ. 27,769 కోట్లకు పెరిగాయి. కంపెనీ మొత్తం స్టీల్‌ ఉత్పాదక వార్షికం సామర్థ్యం  20 ఎంటీకాగా.. ఈ కాలంలో ముడిస్టీల్‌ ఉత్పత్తి 4.3 మిలియన్‌ టన్నుల నుంచి 4.8 ఎంటీకి బలపడింది. అమ్మకాలు 4.21 ఎంటీ నుంచి 4.77 ఎంటీకి ఎగశాయి.  
ఫలితాల నేపథ్యంలో సెయిల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 88 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు