మూడు నెలల కనిష్టానికి బంగారం

5 Jul, 2015 23:53 IST|Sakshi
మూడు నెలల కనిష్టానికి బంగారం

ముంబై : అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా వుండటంతో ముంబై బులియన్ మార్కెట్లో పుత్తడి ధర గతవారం  మరింత క్షీణించి, మూడు నెలల కనిష్టస్థాయికి పడిపోయింది. పుత్తడి క్షీణించడం వరుసగా ఇది రెండోవారం. 99.9 స్వచ్ఛతగల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,820-26,230 మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు రూ. 26,340 వద్ద ముగిసింది. అంతక్రితం వారంతో పోలిస్తే రూ. 195 వరకూ తగ్గింది. 99.5 స్వచ్ఛతగల పుత్తడి అంతేమొత్తం నష్టంతో రూ. 26,190 వద్ద ముగిసింది.

ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం ధర దాదాపు 10 డాలర్లు కోల్పోయి, 1,163 డాలర్ల వద్ద క్లోజయ్యింది. గ్రీసులో జరుగుతున్న రిఫరెండం నేపథ్యంలో అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా వుందని, ఇదే సమయంలో ఇక్కడ రూపాయి మారకపు విలువ బలపడటంతో స్థానిక మార్కెట్లో పుత్తడి ధర తగ్గిందని బులియన్ ట్రేడర్లు చెప్పారు.

మరిన్ని వార్తలు