దూసుకెళుతున్న టయోటా ఇన్నోవా 'క్రిస్టా'

30 May, 2016 16:28 IST|Sakshi
దూసుకెళుతున్న టయోటా ఇన్నోవా 'క్రిస్టా'

హైదరాబాద్ : జపనీస్ ఆటో మొబైల్ సంస్థ టయోటా తాజాగా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఇన్నోవా 'క్రిస్టా' బుకింగ్స్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే దాదాపు 18వేలకు పైగా బుకింగ్ లు నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. మార్కెట్లో అందుబాటులో ఉన్నఇన్నోవా మోడళ్ల కంటే తక్కువ ధరకే ఈ కొత్త క్రిస్టాను వినియోగదారుల ముందుకు తీసుకురావడంతో బుకింగ్స్ వెల్లువ కొనసాగుతోంది. వినియోగదారులు ఈ కొత్త క్రిస్టాల్ పై ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని.. టాప్ ఎండ్ వెర్షన్ ఎక్కువ డిమాండ్ పలుకుతుందని టయోటా కంపెనీ పేర్కొంది. రూ.13.48 లక్షల నుంచి రూ.20.78లక్షలకు మధ్యలో ఈ కారును ఎక్స్ షోరూం ముంబాయిలో ఉంచినట్టు కంపెనీ చెప్పింది. ప్రస్తుతం టయోటా ఇన్నోవాకు చెందిన వెయిటింగ్ పీరియడ్ నాలుగు నెలలుగా ఉంది. డిమాండ్ ఎక్కువగా ఉన్నందున ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్లు టయోటా తెలిపింది.


భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టిన అనతి కాలంలోనే ఈ వాహనానికి అధిక డిమాండ్ పలుకుతుందని టయోటా కిర్లోస్కర్ మోటార్ మేనేజింగ్ డైరెక్టర్ అకితో టాచిబాన అన్నారు. ఇప్పటికే టయోటా కంపెనీకి ఉన్న కస్టమర్లపై ఎక్కువగా దృష్టిపెట్టడంతో పాటు, పోటీని తట్టుకుని నిలబడే శక్తిపై శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగులను నియమించుకుంటామని ప్రకటించారు. భారత్ నుంచి కేవలం వాహనాలను మాత్రమే ఎగుమతులు చేసుకోమని, నిపుణులను కూడా ఎగుమతి చేసుకుని ఆధునిక టెక్నాలజీతో కార్లను రూపొందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు