హైవే బ్యాన్‌ దెబ్బ: చతికిలపడిన యునైటెడ్‌ స్పిరిట్స్‌

24 Jan, 2018 12:51 IST|Sakshi

సాక్షి,ముంబై: లిక్కర్‌ దిగ్గజం యునైటెడ్‌ స్పిరిట్స్‌ క్యూ3లో  నిరాశాజనక ఫలితాలను  ప్రకటించింది.  డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసిక ఫలితాల్లో  ఎనలి​స్టుల అంచనాలను అందుకోలేక పోయింది. నికర లాభాలు 9 శాతం క్షీణించగా ఆదాయం కూడా భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో ఇవాల్టీ మార్కెట్‌లో యునైటెడ్‌ స్పిరిట్స్‌  షేరు  భారీగా నష్టపోయింది. 6.7శాతం పతనమై రూ. 3,501ని తాకింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో యునైటెడ్‌ స్పిరిట్స్‌ లాభం 9 శాతం క్షీణించి రూ. 135 కోట్లను తాకగా..మొత్తం ఆదాయం 8శాతం తగ్గి రూ. 2,263 కోట్లకు పరిమితమైంది. ఇబిటా  సైతం 7శాతం నీరసించి రూ. 272 కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల్లోని మార్కెట్ మార్పులకు అనుగుణంగా ఈ త్రైమాసికంలో తమ నికర విక్రయాలపై ప్రతికూలంగా ప్రభావం కనిపించిందని  యునైటెడ్ స్పిరిట్స్ సిఇఓ ఆనంద్  క్రిపాలు వెల్లడించారు. ముఖ్యంగా హై వేలపై మద్య నిషేధం తమ లాభాలను  కొంతవరకు దెబ్బతీసిందని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు