అగ్రిగోల్డ్‌ నిందితులకు బెయిల్‌

12 Jun, 2018 20:44 IST|Sakshi

సాక్షి, కృష్ణా : అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ సహా ఆరుగురు డైరెక్టర్లకు మంగళవారం మచిలీపట్నం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చార్జ్‌షీట్‌ దాఖలు చేయడంలో క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌(సీఐడీ) విఫలమైంది ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, నిందితులు మరికాసేపట్లో జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.

పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు.

ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు