కులదైవం వద్దకు వెళుతుండగా ప్రమాదం 

10 Apr, 2018 12:04 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన ప్రభుత్వ బస్సు, బోల్తాపడిన వ్యాన్‌

వ్యాన్‌ను ఢీకొన్న ప్రభుత్వ బస్సు

బాలుడు, బాలిక మృతి 

ఎనిమిది మందికి గాయాలు

అన్నానగర్‌:  వ్యాన్‌ను ప్రభుత్వ బస్సు ఢీకొన్న ఘటనలో బాలుడు, బాలిక మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలయ్యాయి.  ఈ ఘటన మవాడిపట్టి సమీపంలో ఆదివారం జరిగింది. వ్యాన్‌ను కోవై రత్తినపురి కన్నప్పనగర్‌ పుదుకోటకు చెందిన శరవణన్‌ (48) సొంతంగా వ్యాన్‌ నడుపుతున్నాడు. ఇతని భార్య శరణ్య (28). వీరికి హరీష్‌ (15) కుమారుడు, హరిణి (10), సూర్యశ్రీ (6) ఇద్దరు కుమార్తెలున్నారు.

వీరి బంధువులు వసంత (30), గంగాదేవి (68), భూపతి (30), దయానంద్‌ (13), సానియా (8)తో సహా 14 మంది శనివారం రాత్రి కోవై నుంచి తూత్తుక్కుడి జిల్లా కోవిల్‌పట్టిలో ఉన్న తమ కులదైవం ఆలయానికి వ్యాన్‌లో బయలుదేరి వెళ్లారు. వ్యాన్‌ను శరవణన్‌ నడిపాడు. అదే సమయంలో గోపిచెట్టి పాళయం నుంచి మదురైకి ఓ ప్రభుత్వ బస్సు బయలుదేరింది. బస్సును మదురైకు చెందిన భూపతి నడిపాడు.

ఆదివారం ఉదయం 5 గంటలకు వాడిపట్టి సమీపం దాదమ్‌పట్టి కాలువ ప్రాంతంలో దిండుక్కల్‌ – మదురై హైవే రోడ్డులో వస్తుండగా హఠాత్తుగా వ్యాన్‌ వెనుక భాగంలో ప్రభుత్వ బస్సు ఢీకొంది. ప్రమాదంలో వ్యాన్‌ బోల్తాపడి నుజ్జునుజ్జయింది. వ్యాన్‌లో చిక్కుకుని దయానంద్, సానియా సంఘటనా స్థలంలోనే మృతి చెందారు

శరవణన్, శరణ్యా, హరిష్, హరిణి, సూర్యాశ్రీ, వసంతా, గంగాదేవి, భూపతి ఈ ఎనిమిది మంది తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వాడిపట్టి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని చికిత్స కోసం మదురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.∙
 

మరిన్ని వార్తలు