Bigg Boss 7 Day 71 Highlights: పైకి చెప్పలేదు గానీ వాళ్లిద్దరి మెయిన్ టార్గెట్ శివాజీనే!

13 Nov, 2023 23:05 IST|Sakshi

బిగ్‌బాస్ 7లో మరో నామినేషన్స్ డే వచ్చేసింది. అయితే ఈసారి రతిక కాస్త ఓవరాక్షన్ చేసింది. అది కూడా ఓ విషయం అర్థం కావడం వల్లే. మరోవైపు అర్జున్, ప్రశాంత్ గాలి అంతా తీసేశాడు. అలా ప్రశాంత్-రతిక అతి వల్ల శివాజీ టార్గెట్ అయిపోయాడు. మరోవైపు శోభా-ప్రియాంక భిన్నంగా ప్రవర్తించారు. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా ఏం జరిగిందనేది Day 71 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

శివాజీ మాయలో రతిక
భోలె ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక భోలె వెళ్లిపోయాడని రతిక ఏడవడంతో సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫ్రెండ్ ఎలిమినేట్ అయినందుకు అశ్విని తెగ బాధపడిపోయింది. అస్సలు ఉండలని అనిపించట్లేదని ఏడుస్తూనే కనిపించింది. మరోవైపు ఎలిమినేషన్ మొదలవడానికి ముందు రతికని శివాజీ ఇన్ఫ్లూయెన్స్ చేశాడు. 'నువ్వు ఏమనుకుంటావో నాకు తెల్వదు, నామినేషన్స్‌లో నీ టాలెంట్ చూపియ్. నన్ను నమ్ము, ఇది నీకు చాలా హెల్ప్ అవుద్ది. అవతల వాళ్లు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూస్కో. అలానే వాళ్లు కూడా ఏం మాట్లాడుతున్నారో విను. భయంలో ఉండి వినకు' అని రతికతో చెప్పాడు. ప్రతిసారి తను ఎవరికీ ఏం చెప్పట్లేదు బాబుగారు అని చెబుతుంటాడు కదా! మరి ఇప్పుడు చేసిందేంటో శివాజీకే తెలియాలి. దీనిబట్టి రతిక గేమ్ మానేసి ఓట్లు కోసం శివాజీ మాయలో పడిందని క్లియర్‍‌గా అర్థమైంది. 

(ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!)

నామినేషన్స్ షురూ
సోమవారం ఎపిసోడ్‌లో భాగంగా కేవలం నలుగురు మాత్రమే తమ నామినేషన్స్ పూర్తిచేశారు. అయితే ఇన్ని వారాలు తినడం, ముచ్చట్లు పెట్టడం తప్ప మరో పనిచేయని రతిక.. ఈసారి నామినేషన్స్‌లో శివాజీ ఇన్ఫ్లూయెన్స్ వల్ల రెచ్చిపోయింది. అయితే చెప్పిన పాయింట్స్ కరెక్ట్‌గా ఉండే బాగున్ను. కానీ శోభా-ప్రియాంక ఈమెని కూల్‌గా హ్యాండిల్ చేసేసరికి రతికకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ అలానే బిహేవ్ చేసింది.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • రతిక - శోభాశెట్టి, ప్రియాంక
  • అర్జున్ - ప్రశాంత్, శోభాశెట్టి
  • ప్రియాంక - రతిక, అశ్విని
  • గౌతమ్ - అర్జున్, అమరదీప్

(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా)

రతిక భయపడిపోయింది
ఓసారి ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చిన రతిక.. తిరిగొచ్చి మూడు వారాలు అవుతున్నా పెద్దగా పీకిందేం లేదు. దీపావళి ఎపిసోడ్‌లో అందరూ ఇదే చెప్పేసరికి ఈసారి నామినేషన్స్ లో ఏదో ఒకటి మాట్లాడేయాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే చేయకపోతే ఇంటికి పంపేస్తారుగా. అందుకే తొలుత శోభాని నామినేట్ చేసింది. గతవారం కెప్టెన్‌గా ఎఫర్ట్ ఏం కనిపించలేదని నామినేషన్‌కి కారణం చెప్పింది. మరి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగ్ సర్ అడిగినప్పుడు, నేను కెప్టెన్సీ బాగానే చేశానని ఎందుకు పైకెత్తావ్ అని శోభా అడగ్గానే.. రతిక టాపిక్ మార్చేసింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే రతికకి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందుకే హైప్ తెచ్చుకోవాలని నామినేషన్స్ లో కాస్త ఓవరాక్షన్ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.

 

రతిక.. ప్రియాంకని కూడా నామినేట్ చేసింది. దీంతో ఈమె కూడా లాజిక్‌తో కొట్టింది. 'నీకు ఇప్పుడు కూడా చెప్పడానికి పాయింట్ లేదు. వేరే వాళ్లు వచ్చి చెబితే దాన్ని నువ్వు సాగదీయడం తప్ప నీకు వేరేవాళ్లపై చెప్పడానికి ప్రత్యేకంగా పాయింట్స్ లేవు. రావు కూడా' అని శివాజీని ఉద్దేశిస్తూ ప్రియాంక సీరియస్ అయింది. ఈ సందర్భంగా వేరే వాళ్లు వచ్చి చెబితే అన్నది శివాజీ గురించే! అలానే 'నాగార్జున సర్ చెప్పేంత వరకు, మీ అమ్మ వచ్చి చెప్పేంత వరకు నీకు నీ విలువ తెలియదు' అని రతిక గాలి మొత్తం ప్రియాంక తీసిపడేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

ప్రశాంత్-శివాజీ యవ్వారం
ఇక అర్జున్.. పల్లవి ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. 'నీ జోలికొస్తే నువ్వు వేస‍్తావ్, బాగానే ఉంటది. కానీ శివాజీ అన్న జోలికొచ్చినా సరే వేస్తావ్ చూడు అక్కడ కొంచెం బాగోదు' అని అర్జున్ కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్ ఎప్పటిలానే హంగామా క్రియేట్ చేయాలని చూశాడు. కానీ మిగతవాళ్లలా అర్జున్ ఊరుకోలేదు. ప్రశాంత్, నామినేషన్స్‌లో భుజం పైకెత్తి, అటుఇటు తిరుగుతూ ఎలా ప్రవర్తిస్తాడో.. సేమ్ అర్జున్ కూడా అలానే బిహేవ్ చేశాడు. దీంతో ప్రశాంత్ మెంటలెక్కిపోయాడు. 'శివాజీ అన్న నీకు ఫస్ట్ హెల్ప్ చేశాడు. నీకు వెన్నెముకలా నిల్చున్నాడు తప్పులేదు. ఇక నుంచైనా ఆయన ఆట నువ్వు ఆడటం మానేసి, నీ ఆట నువ్వు ఆడు' అని అర్జున్ మరో కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఇంకా పెరిగితే తన బండారం బయటపడుతుంది.. బాటిల్ పగలగొట్టేయమన్నాడు. అయితే ప్రశాంత్ గురించి అర్జున్ మాట్లాడుతున్నంతసేపు.. ఏదో తప్పు చేసినవాడిలా శివాజీ ముఖం దించేసి కనిపించాడు.

సో దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా సరే ప్రశాంత్, రతిక, యవర్‌ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. పాపం ఈ ముగ్గురు.. శివాజీ మహానుభావుడు, నీతిమంతుడు, చాణక్య అనుకుని.. అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇప్పటికైనా వీళ్లు శివాజీ చెప్పాడనో, అతడి మాట వింటే ఓట్లు పడతాయనో కాకుండా ఎవరి గేమ్ వాళ్లు ఆడితే బెటర్. లేదంటే ప్రశాంత్, రతిక, యవర్ అని కాకుండా.. శివాజీ చెంచాలుగానే మిగిలిపోతారు. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది.

(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?)

మరిన్ని వార్తలు