టిక్‌ టాక్‌ మోజులో ఐదుగురు యువకుల అదృశ్యం 

21 Jun, 2020 11:55 IST|Sakshi
యువకుల అదృశ్యంపై విచారణ జరుపుతున్న డీఎస్పీ బాషా

సాక్షి, తూర్పుగోదావరి : టిక్‌ టాక్‌ మోజులో పడి డబ్బు సంపాదించాలన్న వ్యామోహంతో ఐదుగురు యువకులు అదృశ్యమైన సంఘటన నగరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వారిలో ఒక యువకుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎన్‌.సతీష్‌బాబు శనివారం కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసుమ్‌ బాషా కథనం ప్రకారం మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన నలుగురు యువకులు కాకినాడకు చెందిన యువకుడితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వీరు రెండు బైక్‌లపై వెళ్లి పోయారని గుర్తించారు. చదవండి: పురుగుల మందు తాగి టిక్‌టాక్

గతంలో పలు రకాల టిక్‌ టాక్‌లు చేసిన అనుభవం ఉన్న ఈ యువకులు ఎక్కడకు వెళ్లారన్నది మిస్టరీగా మారింది. ఒక యువకుడు రాసిన లెటర్‌లో తాము డబ్బు సంపాదన కోసం వెళ్తున్నామని, తమ కోసం ఎటువంటి ఆందోళన చెందవద్దని, తమ తల్లితండ్రులను బాగా చూసుకోవాలని కోరాడు. అదృశ్యమైన వారిలో 16 ఏళ్ల వారు ముగ్గురు, 18 ఏళ్ల వారు ఇద్దరు ఉన్నారు. డీఎస్పీ మాసుమ్‌ బాషా, రాజోలు సీఐ దుర్గాశేఖర్‌ రెడ్డి, నగరం ఎస్సై ఎన్‌.సతీష్‌బాబు తదితరులు ఆ యువకుల కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు. ఈ యువకుల బృందం విశాఖపట్నం వెళ్లినట్లుగా సమాచారం రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిక్‌టాక్‌ మోజులో పడి ఈ యువకులు వెళ్లిపోయారని గుర్తించామని డీఎస్పీ మాసుమ్‌ బాషా విలేకర్లకు తెలిపారు. చదవండి: టిట్‌టాక్‌ చేయడానికి చేపను మింగి..

మిస్సింగ్‌ కేసును చేధించిన పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో ఐదుగురు యువకుల మిస్సింగ్‌ కేసును పోలీసులు చేధించారు. అదృశ్యమైన యువకులంతా ప్రస్తుతం మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం. వీరిని అక్కడనుంచి తీసుకురావడానికి పోలీసులు నగరం నుంచి మంగళగిరి బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు