కేజీహెచ్‌లోనే పసిడి స్మగ్లర్లు

30 Oct, 2018 08:11 IST|Sakshi
జహుబర్‌ సాదిక్‌ అజారుద్దీన్, నైనా ఎండీ సయ్యద్‌లను ప్రశ్నిస్తున్న డాక్టర్‌ ఆర్జున

బయటపడిన 6 బంగారం బిస్కెట్లు

మిగిలిన నాలుగింటి కోసం ప్రయత్నాలు

పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): విమానాశ్రయంలో పట్టుబడిన స్మగ్లర్ల నుంచి ఇంకా పూర్తిస్థాయిలో బంగారం బయటపడలేదు. ముగ్గురు స్మగ్లర్లను శనివారం అరెస్టు చేసిన కస్టమ్స్‌ అధికారులు వారి నుంచి అప్పుడే కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. వారి కడుపులో ఇంకా కొంత బంగారం ఉందన్నఅనుమానంతో వారిని కేజీహెచ్‌కు తరలించి.. కడపులోంచి కక్కించే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. సీటీ స్కాన్, ఎక్స్‌రేల్లో ఇద్దరి కడుపులో ఒక్కొక్కటి, మూడో స్మగ్లర్‌ కడుపులో ఎనిమిది బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు.

మలద్వారా ద్వారా వాటిని బయటకు రప్పించేందుకు మందులు ఇచ్చారు. దాంతో మొదటి ఇద్దరి కడుపులో ఉన్న ఒక్కో బిస్కెట్, ఎనిమది బిస్కెట్లు మింగిన మూడో దుండగుడి నుంచి నాలుగు బిస్కెట్లను బయటకు రప్పించగలిగారు. మిగిలిన నాలుగు బిస్కెట్లను బయటకు రప్పించేందుకు మళ్లీ అతగాడికి మందులిచ్చారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా