ఉసురు తీసిన వివాహేతర సంబంధం

30 Apr, 2018 11:59 IST|Sakshi
స్రవంతి మృతదేహం

మహిళను హతమార్చిన భర్త, కుటుంబసభ్యులు  

నెల్లూరు(వేదాయపాళెం): భర్తకు దూరంగా ఉంటూ మరో వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళను ఆమె భర్త, కుటుంబసభ్యులు దారుణంగా తలపై కొట్టి హతమార్చిన ఘటన నెల్లూరు రూరల్‌ మండలం ధనలక్షీపురంలో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. రూరల్‌ సీఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ధనలక్ష్మీపురానికి చెందిన ఈరగ స్రవంతి (33)కి 15 ఏళ్ల క్రితం చిల్లకూరు మండలం ఉడతావారిపాళెంకు చెందిన వెంకటరమణ అలియాస్‌ వెంకటేశ్వర్లు (మేనమామ)తో వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. 10 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం నెల్లూరుకు వలస వచ్చారు. వేదాయపాళెం సమీపంలోని జనశక్తినగర్‌లో కాపురం పెట్టారు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ధనలక్ష్మీపురానికి చెందిన చల్లా భాస్కర్‌ అనే వ్యక్తితో స్రవంతికి కొంతకాలం క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఏడాదిన్నర నుంచి భార్యాభర్తలు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొడుకు వెంకటరమణ వద్ద ఉండగా కుమార్తె స్రవంతి వద్ద ఉంటోంది. స్రవంతి సింహపురి ఆస్పత్రిలో మహిళా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది.

కొంతకాలంగా భాస్కర్, స్రవంతిలు నగరంలోని పలు చోట్ల కాపురం పెట్టి సహజీవనం చేశారు. ఇటీవల ఆమె స్వగ్రామమైన తన ధనలక్ష్మీపురంలో కాపురం పెట్టింది. భాస్కర్‌ తరచూ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో సోదరుడు రాజేష్, తల్లి పలుమార్లు ఆమె మందలించారు. అయినా ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. శనివారం సాయంత్రం వెంకటరమణ, రాజేష్‌ స్రవంతి ఇంటికి వెళ్లి నీ ప్రవర్తన బాగోలేదని కుమార్తెను తమతో పంపాల్సిందిగా గొడవకు దిగారు. అయితే స్రవంతి కుమార్తెను వారితో పంపేందుకు నిరాకరించింది. దీంతో వారు దౌర్జన్యంగా పాపని తీసుకెళ్లారు. స్రవంతి శనివారం రాత్రి 9 గంటల సమయంలో రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాపను తీసుకెళ్లిన వారిని ఫోన్‌లో పోలీసులు మందలించారు. ఆదివారం ఉదయం పాపను తీసుకుని పోలీసు స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. తమపై పో లీసులకు ఫిర్యాదు చేయడంపై వెం కటరమణ, రాజేష్‌లు ఆగ్రహం పెంచుకున్నారు. ఆది వారం వేకువజామున 1.30 గంటల నిమిషాల సమయంలో స్రవంతి ఇంట్లో నిద్రి స్తుండగా వా రిద్దరూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి తలపై బలంగా కొట్టారు. సమీప ప్రాంతవా సులు పరిస్థితి గురించి 108కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. రూరల్‌ సీఐ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు