కైలాసగిరిపై ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

13 May, 2019 12:36 IST|Sakshi

సూసైడ్‌ నోట్‌లో రాసిన ప్రేమజంట

ప్రియుడు మృతి..చికిత్స పొందుతున్న ప్రియురాలు

ఆరిలోవ(విశాఖతూర్పు): నగరంలోని కైలాసగిరిపై ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం అడారు గ్రామానికి చెందిన చౌడాడ సత్యనారాయణ అలియాస్‌ లక్ష్మణరావు(26), రౌతు కమల(22) కైలాసగిరిపై బాదం జ్యూస్‌లో విషం కలిపి తాగేసి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఇద్దరూ సూసైడ్‌ నోట్‌లు రాశారు. క్షమించండి శివ(అన్నయ్య)... అమ్మను జాగ్రత్తగా చూసుకో. మీతో కలసి ఉండాలని అనుకొన్నా నాకు ఆ ఆదృష్టం లేదు. మామయ్యలతో కలసి అంతా హ్యాపీగా ఉండండి. నన్ను క్షమించండి. అమ్మ నీ ప్రాణం. ఇదే నా ఆఖరి కోరిక. నేను చనిపోవడానికి ఎవ్వరూ కారణం కాదు. మా ఇద్దరం కలిసి ఒకరిని విడిచి మరొకరం ఉండలేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నాము. అంటూ కమల సూసైడ్‌ నోట్‌ రాసింది..

కమల రాసిన సూసైడ్‌ నోట్‌ ,కైలాసగిరిపై మృతిచెందిన సత్యనారాయణ పక్కనే అస్మారక స్థితిలో పడిఉన్న కమల

క్షమించిండి అన్నయ్యా... అమ్మా, నాన్నలను జాగ్రతగా చూసుకో. నువ్వు ఉన్నావనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకొన్నాను. అక్క, బావలను జాగ్రత్తగా చూసుకో. తనను నేను మరిచిపోలేకపోతున్నాను. మా ఇద్దరం కలసి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మా చావుకు ఎవరూ కారణం కాదు. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. మా ఇద్దరి వల్ల మన రెండు కుటుంబాలు గొడవలు పడకూడదు. మా ఇద్దరినీ క్షమించండి అంటూ సత్యనారాయణ సూసైడ్‌ నోట్‌ రాశాడు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు