మాట్రి‘మోసగాడు’!

6 Jul, 2019 07:30 IST|Sakshi

మాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా ఎర

వివాహం, బహుమతులంటూ మోసం

నైజీరియన్‌ను అరెస్టు చేసిన పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిస్థిరపడిన ఓ నైజీరియన్‌ మాట్రిమోనియల్‌ సైట్‌ ఆధారంగా నగరానికి చెందిన యువతిని మోసం చేశాడు. తాను లండన్‌లో ఉంటున్నట్లు నమ్మించి వివాహం, బహుమతుల పేరుతో రూ.16.37 లక్షలు గుంజాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడైన ఒనియనోర్‌ ఎలోనియం బ్రైట్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి శుక్రవారం వెల్లడించారు. నైజీరియా నుంచి వలసవచ్చిన ఒనియనోర్‌ పశ్చిమ ఢిల్లీలోని తిలక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. ఇతడు జీవన్‌సాథీ.కామ్‌ అనే మాట్రిమోనియల్‌ సైట్‌లో తాను లండన్‌లో ఉంటున్నట్లు, తన పేరు బాసిమ్‌కరీం అని ప్రొఫైల్‌ క్రియేట్‌ చేశాడు.

నగరానికి చెందిన యువతి ప్రొఫైల్‌ను లైక్‌ చేసిన అతడు ఆమెతో వాట్సాప్‌ ద్వారా సంప్రదింపులు జరిపాడు. ఓ దశలో వివాహం చేసుకుందామంటూ ప్రతిపాదించాడు. హఠాత్తుగా తాను తన వద్ద ఉన్న భారీ నగదు, బహుమతులతో ఇండియా వస్తున్నానని సమాచారం ఇచ్చాడు. ఇది జరిగిన మరుసటి రోజు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులం అంటూ అతడి అనుచరులు ఈ యువతికి కాల్‌ చేశారు. కరీం అనే వ్యక్తి లండన్‌ నుంచి వచ్చాడని, వస్తూ విలువైన వస్తువులు తేవడంతో ఆపేశామని చెప్పారు. ఆ వస్తువులు, నగదుతో సహా పంపాలంటే పన్ను చెల్లించాలన్నారు. ఆమె ఈ మాటలు నమ్మడంతో వివిధ పన్నుల పేర్లు చెప్పి దఫదఫాలుగా రూ.16.37 లక్షలు గుంజారు. మోసపోయిన బాధితురాలు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒనియనోర్‌ నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!