తాడిపత్రిలో కొనసాగుతున్న ఉద్రిక్తత

17 Sep, 2018 08:01 IST|Sakshi
పోలీసు అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జేసీ దివాకర్‌ రెడ్డి

సాక్షి, అనంతపురం : వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పడిన వివాదంతో తాడిపత్రి అట్టుడుకుతోంది. సోమవారం కూడా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ప్రబోదానందస్వామి భక్తులకు, జేసీ వర్గీయులకు మధ్య రెండు రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు తాడిపత్రిలో 144 సెక్షన్‌ విధించారు. ఈ రోజు జరగవలసిన వినాయక నిమజ్జనాన్ని సైతం వాయిదా వేశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణల కారణంగా ఒకరు మృతి చెందగా దాదాపు 15 మందికిపైగా గాయపడ్డారు. ఓ వైపు ప్రజాప్రతినిధి అనుచరులకు మరో వైపు భక్తులకు సర్ది చెప్పలేక పోలీసులు సతమతమవుతున్నారు.

చేతకాని వాడిలా డ్యూటీ చేస్తున్నారు : జేసీ
తాడిపత్రి పోలీస్‌ స్టేషన్‌ వద్ద జేసీ దివాకర్‌ రెడ్డి ఆందోళన చేపట్టారు. స్టేషన్‌ వద్ద గుంపులుగా ఉన్న జేసీ వర్గీయులను వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మధ్యలో కలుగజేసుకున్న జేసీ.. సమన్వయం పాటించాలని అనుచరులను ఆదేశించారు. తాడిపత్రి డీఎస్పీ విజయకుమార్‌పై జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని వాడిలా డ్యూటీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రబోదానందస్వామి ఆశ్రమ నిర్వాహకులతో  పోలీసులు చర్చలు జరిపారు. భక్తులను పంపేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆశ్రమం చుట్టూ పోలీసు బలగాలు మోహరించాయి.

అట్టుడుకుతున్న తాడిపత్రి

పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారు!

మరిన్ని వార్తలు