రైలు ఢీకొని వ్యక్తి మృతి.. కుడి చేతిపై పచ్చబొట్టు

15 Nov, 2023 09:16 IST|Sakshi

బాలానగర్‌: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి  (35) మృతిచెందిన ఘటన బాలానగర్‌ రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి కుడి చేయిపై హితేష్‌ అనే పచ్చబొట్టు ఉందని రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. మృతదేహాన్ని షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు