విద్యార్థినికి ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు

14 Jun, 2018 15:52 IST|Sakshi
గాయపడిన పొఫెసర్‌.. ఫిర్యాదు చేస్తున్న విద్యార్థిని(ఇన్‌సెట్‌లో)

సాక్షి, నెల్లూరు: నెల్లూరు మెడికల్‌ కాలేజీలో లైంగిక వేధింపుల ఉదంతం కలకలం సృష్టించింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థినిని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు అసభ్యకరరీతిలో ప్రవర్తించిన ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌పై గురువారం దాడిచేశారు.

ఈ దాడిలో మరో ఇద్దరు లెక్చరర్లకు గాయాలయ్యాయి. సక్రమంగా కళాశాలకు రాకపోవడంతో మందలించినందుకే తనపై సదరు విద్యార్థిని ఆరోపణలు చేసిందని ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఆయనపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు