ఒక్కో ఆక్సిజన్‌ సిలిండర్‌ రూ.లక్ష!!

11 Jul, 2020 12:52 IST|Sakshi

హైదరాబాద్‌లో అక్రమంగా ఆక్సిజన్‌ సిలిండర్ల అమ్మకాలు

రెండు ముఠాల గుట్టు రట్టు చేసిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు ఆక్సిజన్‌ అందక కోవిడ్‌ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు కొందరు ఆక్సిజన్‌ సిలిండర్ల దందాకు తెరలేపారు. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈక్రమంలో సిలిండర్ల దందాపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి ఆ ముఠాను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడి చేసిన పోలీసులు  34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. పలు క్లీనిక్‌లు, ఆస్పత్రులు, వ్యక్తిగతంగా కొందరికి ఈ ముఠాలు ఆక్సిజన్‌ సిలిండర్లు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క సిలిండర్‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు అప్పగించామని తెలిపారు. నగరంలో సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
(చదవండి: దుబ్బాకలో మరో డేరాబాబా)

మరిన్ని వార్తలు