కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

28 Nov, 2018 12:06 IST|Sakshi
మృతి చెందిన స్వప్న

చిత్తూరు, తొట్టంబేడు: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన తొట్టంబేడు మండలం చిన్నకన్నలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. టూటౌన్‌ ఎస్‌ఐ జయశ్యామ్‌ కథనం మేరకు.. చిన్నకన్నలి గ్రామానికి చెందిన కిలారి రామానాయుడు, ఆయన భార్య స్వప్న(36) మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలో స్వప్న మంగళవవారం ఉదయం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్ట్‌మార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు