కాలిఫోర్నియాలో ఘనంగా 'తెలుగు మాట్లాట'

4 Sep, 2013 16:25 IST|Sakshi
కాలిఫోర్నియాలో ఘనంగా 'తెలుగు మాట్లాట'

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఆదివారం కాలిఫోర్నియాలోని శాన్ హోసె పట్టణంలో నిర్వహించిన 'తెలుగు మాట్లాట' ఆటల పోటీలు అంగరంగవైభవంగా జరిగాయి. ఈ మేరకు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభోట్ల ఆనంద్ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ తెలుగు సినీ రచయిత భారవి, ప్రఖ్యాత వైద్యులు లక్కిరెడ్డి హనిమిరెడ్డిలు ముఖ్య అతిథిలుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారని తెలిపారు.

 

విజేతలకు జ్ఞాపికలు, ప్రశంస పత్రాలతోపాటు ప్రథమ స్థానం పొందిన చిన్నారులకు రూ. 1116 యూఎస్ డాలర్లు, రెండవ స్థానం కైవసం చేసుకున్న వారికి రూ. 751 డాలర్లు అందజేసినట్లు వివరించారు. విజయసారథి, మనబడి కులపతి రాజు చమర్తి తదితరుల ఈ సందర్భంగా ప్రసంగించారన్నారు. తెలుగు భాషకు సేవ చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు గారికి ఈ సందర్భంగా ఘన నివాళులు ఆర్పించినట్లు చెప్పారు.

అమెరికాలోని ప్రాంతాలు, రాష్ట్రాలు వారిగా నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 7 వందలమందికి పైచిలుకు విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారిలో తుది జాబితాకు 36 మంది చిన్నారులు చేరుకున్నారని చెప్పారు. 6- 11 సంవత్సరాల పిల్లలను సిసింద్రీలు అని, 12 - 16 వయస్సు గల చిన్నారులను చిరుతలుగా చేసి నామకరణం చేసి నిర్వహించిన పోటీలు అద్యంతం ఆసక్తిగా సాగాయని చెప్పారు. తుది విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఆయన వివరించారు.

చిరుతలు : పదరంగం - ప్రథమ బహుమతి నందిని పిసుపాటి ( చాంటిల్లి, వర్జీనియా) ద్వితీయ బహుమతి ఆమోఘ కోక (సిమివ్యాలి, కాలిఫోర్నియా)లు కైవసం చేసుకున్నారు.
సిసింద్రీలు: పదరంగం - ప్రథమ బహుమతి శ్వేత మల్యాల (ఫ్రీ మౌంట్, కాలిఫోర్నియా), ద్వితీయ బహుమతి లాలస రాచపూడి
(రాండోల్ఫ, న్యూజెర్సీ), జాహ్నవి చమర్తి (కుపర్తినో, కాలిఫోర్నియా)లు సంయుక్తంగా అవార్డులు సొంతం చేసుకున్నారు.   
చిరుతలు: తిరకాటం - ప్రథమ బహుమతి మధుమహిత మద్దుకూరి (కొప్పెల్, టెక్సాస్), ద్వితీయ బహుమతి ప్రతిమ కందుకూరి
(ఇర్వింగ్, టెక్సాస్) అందుకున్నారు.
సిసింద్రీలు: తిరకటం- ప్రథమ బహుమతి స్రవంతి ప్రత్తిపాటి (సాన్ హొసే, కాలిపోర్నియా), ద్వితీయ బహుమతి నవ్యత బుడ్డి
(బేవర్టన్, పోర్ట్లాండ్) తీసుకున్నారు.

మరిన్ని వార్తలు