అప్లై చెయ్యండి ఆరాక కడగండి

30 Dec, 2015 19:12 IST|Sakshi
అప్లై చెయ్యండి ఆరాక కడగండి

బ్యూటిప్స్
 
ఒక టీ స్పూను చక్కెరలో అంతే మోతాదులో నిమ్మరసం, కొద్దిగా నీటిని వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్‌ప్యాక్‌లు వేసుకునే బ్రష్‌తో ముఖానికి (అవాంఛిత రోమాలు ఉన్న చోట) అప్లయ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే ఫలితం ఉంటుంది.ఒక టేబుల్ స్పూను నిమ్మ రసంలో నాలుగు టీ స్పూన్ల తేనె కలిపి బ్రష్‌తో ముఖానికి అప్లయ్ చేసి ఆరిన తర్వాత కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాల్సి ఉంటుంది.

 పాలలో పసుపు వేసుకుని పేస్టులా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరనివ్వాలి. ఇప్పుడు ముఖానికి వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ మర్దన చేయాలి. ఇది అవాంఛిత రోమాలను తొలగించడంతోపాటు స్క్రబ్‌గా పని చేసి మృతకణాలను కూడా పోగొడుతుంది. మర్దన చేయడం పూర్తయిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.  ఒక టేబుల్ స్పూను శనగపిండిలో ఒక టీ స్పూను పసుపు వేసి తగినంత నీటితో పేస్టులా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ కడగాలి.
 

మరిన్ని వార్తలు