మెదడుకు చురుకుదనం

11 Feb, 2017 23:21 IST|Sakshi
మెదడుకు చురుకుదనం

అరటిపండులో చక్కెర... సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌ వంటివి సహజరూపంలో ఉంటాయి. పీచు పదార్థాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. రెండు అరటిపండ్లు తింటే 90 నిమిషాల సేపు పని చేయవచ్చని పరిశోధనల్లో రుజువైంది. అందుకే క్రీడాకారులు ఎక్కువగా అరటిపండు తీసుకుంటారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అరటిపండు మంచి ఆహారం. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తింటే శక్తితోపాటు జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.
ప్రీ మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ (పిఎంఎస్‌) సమస్య ఉన్న వాళ్లు పీరియడ్స్‌కు కనీసం వారం ముందు నుంచి ప్రతిరోజూ అరటిపండు తింటుంటే ఆ సమయంలో ఆందోళన, ఉద్వేగం వంటి లక్షణాలు అదుపులో ఉంటాయి.
డిప్రెషన్‌ వ్యాధిగ్రస్తుల మానసిక స్థితిలో అరటిపండు తినడానికి ముందు, తిన్న తర్వాత గణనీయమైన మార్పులు వస్తున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇందులో ఐరన్‌ సమృద్ధిగా ఉంటుంది. ఎనీమియాను అరికడుతుంది. బ్లడ్‌ప్రెజర్‌ను అదుపులో ఉంచుతుంది. గుండెపోటును నివారించడంలో బాగా పని చేస్తుంది.
ఇందులోని పొటాషియం మెదడును అప్రమత్తంగా ఉంచుతుంది. రెండు వందల మంది విద్యార్థుల మీద నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం నిర్థారణ అయింది. క్రమం తప్పకుండా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కాని, మధ్యాహ్న భోజనం తర్వాత కాని అరటిపండు తిన్న వారిలో మెదడు మరింత చురుకుగా పని చేస్తుందట.

మరిన్ని వార్తలు