ఎరక్కపోయి..ఇరుక్కుపోయాడు

3 Dec, 2016 00:08 IST|Sakshi
ఎరక్కపోయి..ఇరుక్కుపోయాడు

దుబాయ్ పోలీసుల చెరలోపాతబస్తీ యువకుడు
సాయం చేయబోరుు  నిషేధిత మత్తు టాబ్లెట్లు
ఉండటంతో అరెస్టు విషయం తెలిసి తప్పించుకున్న సూత్రధారులు

సిటీబ్యూరో: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ యువకుడు పరిచయస్తులకు సాయం చేయబోరుు ఇబ్బందుల్లో పడ్డాడు. తనకు తెలియకుండానే స్మగ్లర్‌గా మారడంతో దుబాయ్ విమానాశ్రయంలో అధికారులకు చిక్కాడు. విషయం తెలిసి సూత్రధారులు తప్పించుకుని పారిపోగా... ఎరక్కపోరుు ఇరుక్కుపోరుున యువకుడు మాత్రం ప్రస్తుతం దుబాయ్‌లో విచారణ ఎదుర్కోబోతున్నాడు. గత నెలలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఉద్యోగం కోసం వెళ్తుండగా
పాతబస్తీలోని బార్కస్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గత నెలలో ఉద్యోగం కోసం దుబాయ్ పయనమయ్యాడు. ఈ విషయం తెలిసిన పరిచయస్తులు దుబాయ్‌లోనే ఉన్న తమ వారికి స్వీట్లు తీసుకువెళ్ళాల్సిందిగా కోరారు. కేవలం మిఠారుులే కదా అనే ఉద్దేశంతో సదరు యువకుడు అందుకు అంగీకరించాడు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు ఆ పరిచయస్తులు ఓ స్వీట్ ప్యాకెట్‌ను పార్శిల్ చేసి తీసుకువచ్చి అతడికి ఇచ్చారు. తన లగేజ్‌తో పాటు దానిని తీసుకుని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన యువకుడు దుబాయ్‌లో దిగిన తర్వాత ఇబ్బందులు మొదలయ్యారుు.

తనిఖీల్లో బయటపడిన ట్యాబ్లెట్స్...
దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు సదరు యువకుడితో పాటు అతడు తీసుకువచ్చిన లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో స్వీట్ బాక్స్ అడుగున ఉన్న మూడు స్ట్రిప్స్ మత్తు ట్యాబ్లెట్లను గుర్తించారు. వీటిపై ఆ దేశంలో నిషేధం ఉన్నందున వీటిని కలిగి ఉంటే అక్కడి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. దీంతో నిషేధిత ట్యాబ్లెట్లు తీసుకువచ్చిన యువకుడిని దుబాయ్ విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ స్వీట్ ప్యాకెట్ తనది కాదని, పరిచయస్తులు దుబాయ్‌లో ఉన్న తమ వారి కోసం పంపించారని బాధితుడు పోలీసులకు చెప్పాడు.

ఫోన్ చేయడంతో కథ అడ్డం తిరిగి...
యువకుడు చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు ఆ ప్యాకెట్ ఎవరికి అందించాల్సి ఉందో వారికి ఫోన్ చేసి రప్పించాల్సిందిగా ఆదేశించారు. ఇందుకోసం ఓ ఫోన్ కాల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అరుుతే నగర యువకుడు దుబాయ్‌లో వాటిని రిసీవ్ చేసుకోవాల్సిన వారికి ఫోన్ చేయకుండా... నగరంలో దాన్ని తనకు ఇచ్చిన పరిచయస్తులకు కాల్ చేసి విషయం చెప్పాడు. తన ప్రమేయం లేకుండా తనను ఇబ్బందుల పాలు చేశారంటూ వాపోయాడు. దుబాయ్‌లో స్వీట్ ప్యాకెట్ తీసుకోవాల్సిన వారి వివరాలు వెలుగులోకి వచ్చిన వెంటనే అక్కడి అధికారులు అరెస్టు చేస్తారని భావించిన ‘పరిచయస్తులు’ వెంటనే ఫోన్ ద్వారా అక్కడి తమ వారిని అప్రమత్తం చేశారు.

ఢిల్లీకి పారిపోరుు వచ్చిన సూత్రధారులు...
హైదరాబాద్‌లో ఉన్న వారి ద్వారా విషయం తెలుసుకున్న ‘ప్యాకెట్ రిసీవర్లు’ తక్షణం దుబాయ్ వదిలేశారు. ఆఘమేఘాల మీద ఆ దేశం విడిచిపెట్టి, వివిధ దేశాలు తిరుగుతూ ఢిల్లీకి వచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్ పోలీసులు సూత్రధారులకు సహకరించడానికే హైదరాబాద్ యువకుడు ఫోన్ చేిసినట్లు భావింస్తూ సదరు యువకుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసు అక్కడి న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఢిల్లీ పారిపోరుు వచ్చిన, నగరంలో ఉన్న సూత్రధారులు చిక్కితే తప్ప పాతబస్తీ యువకుడు శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితులు కనిపించట్లేదు.

ఎందుకు నిషేధించారంటే...
మత్తు ట్యాబ్లెట్స్‌ను దుబాయ్‌లో నిషేధించడానికి పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు ఈ తరహా ట్యాబ్లెట్లు అక్కడ కూడా లభించేవి. మరోపక్క దుబాయ్‌లో నివసిస్తున్న పాకిస్థానీయులు జర్దాను విరివిగా వినియోగిస్తున్నారు. ఆ దేశానికి చెందిన యువత మత్తు మందులు, డ్రగ్‌‌స దొరకని సందర్భాల్లో ఈ రెంటినీ శీతలపానీయాల్లో కలిపి తాగుతున్నారు. దీంతో నిషాలో జోగుతూ ఆ మత్తులో వాహనాలు నడుపుతూ ప్రాణాలు వదులుతున్నారు. వరుసగా వెలుగులోకి వచ్చిన ఉదంతాలను పరిగణలోకి తీసుకున్న అక్కడి అధికారులు మత్తు ట్యాబ్లెట్స్, జర్దా విక్రయాలను నిషేధించారు. కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే అనుమతులు తీసుకున్నాక పరిమితంగా విక్రరుుంచే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు