పంట పొలంలోని బావి దగ్గరకు వెళ్లి.. వ్యక్తి తీవ్ర నిర్ణయం!

16 Nov, 2023 08:48 IST|Sakshi
చాకెటి భోజన్న(ఫైల్‌)

బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి..

అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడతో..

సాక్షి, ఆదిలాబాద్‌: భైంసా మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన చాకెటి భోజన్న(35) బావిలో దూకి ఆ త్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... చాకెటి భోజన్న బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం దుబాయ్‌ వెళ్లి నష్టపోయాడు. రెండేళ్ల క్రితం స్వగ్రామానికి చేరుకుని ఇంటిని నిర్మించుకున్నాడు. దీంతో అప్పులు పెరిగిపోయాయి.

అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడతో కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం సాయంత్రం పంట పొలానికి నీటిని పట్టించేందుకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. పంట పొలంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్ల డించాడు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: కూతురును కళాశాలలో దింపేందుకు.. బయల్దేరిన ఐదు నిమిషాల్లోనే..

మరిన్ని వార్తలు