నవంబర్ 6 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

5 Nov, 2015 23:34 IST|Sakshi
నవంబర్ 6 న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
యువికా చౌదురి (బాలీవుడ్ నటి).

 
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 7. ఈ సంఖ్యకి జ్ఞాన, మోక్షకారకుడు కేతువు అధిపతి కావడం వల్ల మానవాతీత శక్తులు, అతీంద్రియ శక్తుల మీద అభిలాష కలుగుతుంది. మంచి విశ్లేషకులుగా, సద్విమర్శకులుగా పేరు తెచ్చుకుంటారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. విదేశీ మిత్రుల సాయంతో సౌఖ్యవంతమైన జీవితం గడుపుతారు. ఆస్తికి సంబంధించిన ప్రణాళికలు ఫలప్రదం అవుతాయి. అవివాహితులకు వివాహం, సంతానం లేనివారికి సంతానప్రాప్తి కలుగుతాయి. కుటుంబానికి విలువ ఇస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నర్సులు, డాక్టర్లు, పురోహితులు, జ్యోతిష్యులు, అధ్యాపకులకు సంఘం లో గౌరవం పెరుగుతుంది. వీరు పుట్టిన తేదీ 6. ఇది శుక్ర సంఖ్య. దీనివల్ల జీవితం ఆనందంగా, ఉత్సాహంగా, సౌఖ్యవంతంగా గడిచిపోతంంది. ఈ సంవత్సరం విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

కోరుకున్న ఇన్‌స్టిట్యూషన్ల లో సీటు వస్తుంది. వ్యాపార వృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు మంచి పనితీరు కనబరచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. మీడియా, సినీ రంగాలలో ఉన్న వారికి మంచి అవకాశాలు, గుర్తింపు వస్తాయి. లక్కీ నంబర్స్: 1,2,5,6,7,9; లక్కీ కలర్స్: వైట్, క్రీమ్, గ్రీన్, గోల్డెన్, గ్రే, పర్పుల్, బ్లూ, శాండిల్, ఎల్లో. లక్కీ డేస్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: సిద్ధపురుషులు, సాధువులు, పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లను ఆదరించి, గౌరవించడం వల్ల వీరికి వాక్‌శుద్ధి, సిద్ధి కలుగుతాయి. దీనితోబాటు తోబుట్టువులను ఆదుకోవడం, నవగ్రహాభిషేకం చేయించుకోవడం, బీదవిద్యార్థులకు పుస్తకాలు, ఆహారం పంపిణీ చేయడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
 

మరిన్ని వార్తలు