Indian web series: ఇండియాలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ ఇదే!

13 Nov, 2023 18:31 IST|Sakshi

ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీల్లో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కొత్త సిరీస్‌లు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే స్కామ్-2003, కాలా పానీ లాంటి సిరీస్‌లు ప్రేక్షకులను అలరించాయి. గతంలో ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, సేక్రెడ్ గేమ్స్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ సిరీస్‌ కూడా వచ్చాయి. అయితే ఓటీటీలో ఇండియాలోనే 4 కోట్ల వ్యూస్‌తో ఎక్కువ ఆదరణ దక్కించుకున్న వెబ్ సిరీస్‌గా షాహిద్ కపూర్ నటించిన ఫర్జీ నిలిచింది. 

(ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న మృణాల్ మూవీ.. ఏకంగా జైలర్‌ను వెనక్కి నెట్టి!)

ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకింగ్ ఏజెన్సీ ఓర్మాక్స్ మీడియా ఒక్క సీజన్‌లో వచ్చిన వ్యూస్ ఆధారంగా అత్యధికంగా వీక్షించబడిన టాప్ 10 భారతీయ వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. సేక్రేడ్ గేమ్స్, మీర్జాపూర్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లను అధిగమించిన ఫర్జీ.. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఫర్జీ జూన్‌ నెల వరకే 3.7 కోట్ల వ్యూస్ సాధించగా.. తాజాగా వీక్షణల సంఖ్య 4 కోట్లకు చేరుకుంది. రెండో స్థానంలో అజయ్ దేవగన్ నటించిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ నిలిచింది. దీనికి 3.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. 

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోన్న మీర్జాపూర్, పంచాయత్ వరుసగా 3.2 కోట్లు, 2.96 కోట్ల వ్యూస్ సాధించాయి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న క్రిమినల్ జస్టిస్: బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ ‍అనే వెబ్ సిరీస్ 2.91 కోట్ల వీక్షణలతో  ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత టాప్ 10లో ఉన్న ఇతర సిరీస్‌లలో ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, ది నైట్ మేనేజర్, తాజా ఖబర్, ది గ్రేట్ ఇండియన్ మర్డర్, స్కామ్ 1992 ఉన్నాయి. ‍అయితే ఆదరణ ఉన్నప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సేక్రేడ్ గేమ్స్‌ వెబ్ సిరీస్‌కు టాప్ 10లో చోటు చేసుకోలేదు. ఎందుకంటే ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్ తక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తోంది. 

(ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న మృణాల్ మూవీ.. ఏకంగా జైలర్‌ను వెనక్కి నెట్టి!)

మరిన్ని వార్తలు