రంగస్థల కస్తూర్బా

23 Feb, 2020 01:55 IST|Sakshi

జీనత్‌ అమన్‌ వయసు 68 ఏళ్లు. పూర్వపు తరాల ఆరాధ్య నాయిక. మోకాళ్లపైకి స్కర్ట్‌ వేసుకుని, చేతివేళ్ల మధ్య వెలుగుతున్న సిగరెట్‌తో నాటì  యౌవ్వనస్తులను ‘మీకు నిద్ర ఉండకుండును గాక’ అని శపించిన జీనత్‌ ఇప్పుడు కస్తూర్బాగా రంగస్థలం మీదనైనా నటించడం అపచారమేమీ కాబోదు.

జాతిపితగా మాత్రమే మీరు గాంధీజీని ఎరిగి ఉన్నట్లయితే, ఆయన భార్య కస్తూర్బాగా జీనత్‌ అమన్‌ నటిస్తున్న రంగస్థల నాటకం ‘డియరెస్ట్‌ బాపు, లవ్‌ కస్తూర్బా’.. మీకు ఆయనలోని ఒక ఔన్నత్యం గల భర్తను చూపిస్తుంది. సైఫ్‌ హైదర్‌ హసన్‌ ఈ నాటకానికి రచయిత, దర్శకుడు. గాంధీజీగా ఆరిఫ్‌ జాకరియా నటిస్తున్న ‘డియరెస్ట్‌ బాపు..’ ను శుక్ర, శనివారాల్లో ముంబైలోని ‘నాటక్‌’ కళావేదికపై ప్రదర్శించారు. ‘ది గ్రేట్‌ ఇండియన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌–2020’ పేరుతో బుక్‌ మై షో సమర్పిస్తున్న ఈ నాటకాన్ని దేశంలోని ఆరు నగరాలలో (ముంబై, ఢిల్లీ, బెంగళూరు, వడోదర, చెన్నై, హైదరాబాద్‌) మార్చి 1 వరకు ప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో 4 గంటలకు మొదలయ్యే ‘డియరెస్ట్‌ బాపూ..’ రాత్రి గం. 80.20 వరకు కొనసాగుతుంది.

‘డియరెస్ట్‌ బాపు, లవ్‌ కస్తూర్బా’ నాటకం క్విట్‌ ఇండియా ఉద్యమంతో మొదలౌతుంది. గాంధీజీ అరెస్ట్‌ అవుతారు. పుణెలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో ఆయన్ని నిర్బంధిస్తారు. దాంతో ఉద్యమాన్ని నడిపించే బాధ్యత కస్తూర్బా తీసుకుంటారు. ఆమెనూ అరెస్ట్‌ చేస్తారు. ముంౖ»ñ లోని ఆర్థర్‌ రోడ్‌ జైలుకు పంపుతారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. అమెను కూడా భర్త ఉన్న ఆగాఖాన్‌ ప్యాలెస్‌కే పంపుతారు. కొంతకాలానికి ఆమె మరణిస్తారు. ఇక అక్కడి నుంచి ఆమె ఆత్మ.. గాంధీజీకి లేఖలు రాస్తుంటుంది. ఆ లేఖల్లో వాళ్ల అరవై ఏళ్ల అనురాగ దాంపత్యం గురించి ఉంటుంది. పెళ్లయినరోజు నుంచి గాంధీజీ ఒడిలో ఆమె కన్నుమూసే వరకు వారిద్దరి మధ్య అనుబంధాల్ని ప్రభావితం చేసిన ప్రతి సందర్భమూ ఉంటుంది. ఆ లేఖలకు గాంధీజీ స్పందిస్తుంటారు.

‘‘కస్తూర్బా గురించి బయటికి తెలిసింది చాలా తక్కువ. భర్త చాటు భార్యగానే ఆమె జీవించారు’’ అని జీనత్‌ అమన్‌ అంటున్నారు. నాటకంలోని లేఖల ద్వారా, నాటకంలో గాంధీజీ భార్యగా నటించడం వల్ల బహుశా ఆమె అలా అనుకుని ఉండొచ్చు. అన్ని తరహాల పాత్రలకూ జీవం పోశారు జీనత్‌. నటిగా మాత్రమే ఆమెను చూడగలిగితే ఆమెను పూర్తిస్థాయి కస్తూర్బాను కూడా మనం చూడగలం. పదిహేనేళ్ల తర్వాత ఒక నాటకంలో జీనత్‌ నటించడం మళ్లీ ఇదే మొదటిసారి. తొలిసారి 2004లో ‘ది గ్రాడ్యుయేట్‌’ నాటకంలో మిసెస్‌ రాబిన్‌సన్‌గా నటించారు జీనత్‌. అప్పటికి పదేళ్లగా ఆమె సినిమాల్లో లేరు. ఆ నాటకం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ‘పానిపట్‌’ (2019) ఆమె ఇటీవలి సినిమా. అందులో ఆమె మొఘల్‌ రాణి సకీనా బేగంగా నటించారు.

>
మరిన్ని వార్తలు