Prabhas Viral Video: గురువుకు బంగారు బహుమతిచ్చిన డార్లింగ్‌, వీడియో వైరల్‌

6 Dec, 2023 10:23 IST|Sakshi

స్టార్‌ హీరో ప్రభాస్‌ స్టయిలే వేరు. సినిమాల ఎంపికలోనే కాదు ఆతిథ్యంలోనూ అదే తీరు ప్రదర్శిస్తుంటాడు డార్లింగ్‌ హీరో! తనకు నచ్చినవాళ్ల కోసం ఇంట్లో వంట చేయించి మరీ విందు ఇస్తాడు. ఒక్కోసారి సెట్‌లోకి అందరికీ సరిపడా ఆహారం తీసుకుచ్చి మరీ ఆప్యాయంగా వడ్డిస్తుంటాడు. అప్పుడప్పుడూ బహుమతులు పంపిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు కూడా! తన తోటివారిపై అంత ప్రేమ చూపిస్తుంటాడీ బాహుబలి.

గురువు బర్త్‌డే అంటే ఆమాత్రం ఉంటది
తనకు నటనలో ఓనమాలు నేర్పిన గురువు సత్యానంద్‌కు అప్పట్లో ఖరీదైన బహుమతిచ్చాడు ప్రభాస్‌. సత్యానంద్‌ పుట్టినరోజు పురస్కరించుకుని తన ఇంటికి వెళ్లి మరీ గిఫ్ట్‌ ఇచ్చాడు. బంగారు వాచ్‌ను గురువు చేతికి తొడిగి మరీ సంతోషించాడు. 'ఇది నిజమైన బంగారం, పొరపాటున ఎక్కడ పడితే అక్కడ పడేయకండి' అని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌ అవుతోంది.

సలార్‌తో ముందుకు రానున్న ప్రభాస్‌
గత కొంతకాలంగా ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న ప్రభాస్‌ ఈ నెలలో బాక్సాఫీస్‌ ముందుకు రాబోతున్నాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన సలార్‌: సీజ్‌ ఫైర్‌ డిసెంబర్‌ 22న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించగా శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. పృథ్వీరాజ్‌ సుకుమారన్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.

చదవండి: ఆవేశంతో కాల్పులు.. ప్రముఖ నటుడు అరెస్ట్‌..

>
మరిన్ని వార్తలు