‘క్యాట్‌వాక్’

9 Mar, 2015 00:06 IST|Sakshi
‘క్యాట్‌వాక్’

క్యాట్‌వాక్... మోడల్స్ పిల్లి నడక! కానీ ఈ పిల్లుల ‘క్యాట్‌వాక్’ చూస్తే టాప్ మోడల్స్ కూడా వెనక్కు పోవాల్సిందే. క్యాట్ ఫుడ్ బ్రాండ్ విస్కాస్... నగరంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన ఈ షోలో అందంగా
 అలంకరించుకున్న జాతి పిల్లులు హుందాగా నడిచాయి.
 
 ఎదురొస్తేనే అపశకునంగా భావించే పిల్లులు.. ఎప్పుడో పెంపుడు జంతువుల జాబితాలో చేరాయి. ఇప్పుడు ఈ పెట్స్‌కే టాప్ ప్రేయారిటీ ఇస్తున్నారు నగరవాసులు. కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు. ఒక్క నగరంలోనే కాదు ప్రస్తుతం ఇతర దేశాల్లో సైతం డాగ్స్ కంటే క్యాట్స్‌ను పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వీటిని పెంచేవారికి... పెట్స్ గురించి సమాచారం తెలియజేయడానికి ఈ ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది విస్కాస్. ఇందులో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 130 మేలు జాతి పిల్లులు పాల్గొన్నాయి. ట్రెడిషనల్ లాంగ్ హెయిర్, బ్రిటిష్ లాంగ్ హెయిర్ బ్రీడ్, నార్వేజియన్ బ్రీడ్, అరేబియన్ మావ్ ఇలా 16 రకాల బ్రీడ్స్ ఇందులో పోటీపడ్డాయి. విస్కాస్‌కు ఇది నాలుగో అంతర్జాతీయ షో. వరల్డ్ క్యాట్ షో మ్యాప్‌లో ఇండియాకు స్థానం కల్పించడమే ఈ షో లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో బ్లూ క్రాస్ చైర్‌పర్సన్ అమల... హైదరాబాదీ బిల్లీలను ఫ్రీ
 అడాప్షన్ కోసం ఉంచారు.
 
 కలిసొచ్చింది...
 ‘నా పిల్లి పేరు డస్టీ. నేను పుట్టినప్పటికే మా ఇంట్లో పిల్లి ఉండేది. దానికి రెండు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటే ఈ డస్టీ. దీనికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫీలింగ్స్‌ను, ఎమోషన్స్‌ను ఇట్టే
 
 పట్టేస్తుంది. నేను డల్‌గా కనిపిస్తే సంతోషపెట్టడానికి ‘పిల్లి’మొగ్గలు వేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో నా సిస్టర్‌లా పెరుగుతోంది. దీని పోషణకు నెలకు ఆరువేల రూపాయల దాకా ఖర్చవుతుంది’ అని చెబుతోంది మాసబ్ ట్యాంక్‌లో ఉండే అదీబా. ‘మా సిస్టర్స్‌కు పిల్లులు అంటే చాలా ఇష్టం. అమెరికా నుంచి నాలుగు పర్షియన్ క్యాట్స్‌ను ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి 45 వేల రూపాయలు. వీటికి సపరేట్ ఏసీ రూమ్ ఉంది. క్యాట్ ఫుడ్‌తోపాటు స్టీమ్‌డ్ చికెన్, ఫిష్ బాగా తింటాయి. కేజింగ్ నచ్చదు. ఫ్రీగా ఉండటానికే ఇష్టపడతాయి. అందరూ  అపశకునంగా భావిస్తారు కానీ పిల్లులతో మాకు కలిసొచ్చింది’ అంటున్నాడు యూసఫ్‌గూడవాసి
 మోసిన్‌ఖాన్.
 
 శుభ పరిణామం...
 ‘పిల్లి ఇండిపెండెంట్ నేచర్ ఉన్న ఫ్రెండ్లీ పెట్. ఇవి ఎదురొస్తే అపశకునంలా భావించడం చూస్తుంటాం. కానీ ఈ క్యాట్ వాక్‌లో 45 జాతుల పిల్లులు నగరం నుంచే పాల్గొన్నాయి. దీనిద్వారా మూఢనమ్మకాలు లేనివారు సిటీలోనూ ఉన్నారన్న విషయం అర్థమవుతోంది. ఇది మంచి పరిణామం’ అన్నారు అమల.
   శిరీష చల్లపల్లి
 

మరిన్ని వార్తలు