ఇవి తిమ్మక్క మర్రిమానులు!

8 Jul, 2013 03:38 IST|Sakshi
ఇవి తిమ్మక్క మర్రిమానులు!
 ప్రస్తుతం తిమ్మక్క వయసు 101 సంవత్సరాలు. ఈమె ఇప్పటి వరకూ పెంచిన చెట్ల సంఖ్య వెయ్యి. బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్ హులికల్ గ్రామానికి చెందిన వారు తిమ్మక్క, చిక్కన్నలు. గత 25 సంవత్సరాల్లో ఈ దంపతులు ఈ చెట్లను వృద్ధి చేశారు. తమ ఊరి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే కుందూర్‌కు వెళ్లే రహదారికి ఇరువైపులా వీరు చెట్లను పెంచారు. ప్రతి యేటా చెట్లను నాటుతూ కుండల్లో వాటికి నీరు పోయడమే పనిగా బతికారు. వీరికి వాతావరణం కూడా సహకరించడంతో నాటిన  విత్తనాలన్నీ మొక్కలై వృక్షాలయ్యాయి. బాటకు ఇరువైపులా కొత్త అందంగా మారాయి. పిల్లలు లేని ఈ దంపతులు ఈ చెట్లనే తమ సంతానంగా పేర్కొంటారు. కొన్ని సంవత్సరాల కిందట చిక్కన్న మరణించాడు. అప్పటినుంచి తిమ్మక్కే ఈ చెట్లను దగ్గరుండి చూసుకుంటోంది. ఈమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా ఉంది. ఈమెకు సాలుమరద తిమ్మక్క (సాలు మరద అంటే కన్నడలో ‘చెట్ల వరస’ అని అర్థం)గా పేరు.
 
మరిన్ని వార్తలు