విహంగ విలాసం

12 Mar, 2016 23:40 IST|Sakshi
విహంగ విలాసం

ఫేమస్ టూన్
చెట్టు మీద తీరిగ్గా కూర్చున్న పక్షులను చూసినప్పుడు, అవి అందంగా ఆకాశంలో ఎగురుతున్నప్పుడు సినారె రాసిన కవిత ఒకటి హృదయాన్ని తాకుతుంది ఇలా... ‘పక్షులు తన గూళ్లలో ఎప్పుడు ఒదిగివుంటాయో గోడల మీద ఎప్పుడు కొలువు తీరుతుంటాయో కొమ్మల మీద ఎప్పుడు విశ్రమిస్తుంటాయో గగనం పిలుపందితే ఎప్పుడు తటాలున ఎగిరిపోతుంటాయో అంతుపట్టదు!’ రుమేనియన్ కార్టూనిస్ట్ జూలియన్ పెనా పాయ్ కార్టూన్‌లోని పక్షిని చూస్తే మాత్రం... కారణం సులభంగా అంతుపడుతుంది.  

ఎవరూ లేని ఒంటరి దీవిలో తనకు గింజలు పెట్టి పెద్ద చేసిన యజమాని రుణం తీర్చుకోవాలనుకుంది... అందుకే  ఆ యజమానిని అమాంతం దీవి నుంచి తీసుకెళ్లింది. మనం పక్షులకు మేలు చేస్తే అవి మనకు మేలు చేస్తాయనే భావాన్ని చెప్పే కార్టూన్ ఇది.  ఈ కార్టూన్ గీసిన జూలియన్‌కు కార్టూన్‌లు గీయడంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అంతర్జాతీయంగా తొంబైకి పైగా బహుమతులు గెలుచుకున్నారు. అంతర్జాతీయ కార్టూన్ పోటీ జ్యూరీలకు ఒక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
 
‘కార్టూన్ ఐడియాల పరిణామ క్రమం’ మీద జూలియన్ సాధికారికంగా మాట్లాడగలరు. ‘ఒక మంచి కార్టూన్ రూపొందడా నికి ఏవి దోహదం చేస్తాయి?’ అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఇది... ‘ఒక మంచి కార్టూన్ రూపొంద డానికి కాన్సెప్ట్ లేదా ఐడియా అనేది ప్రాథమికం. ఐడియా అనేది కార్టూనిస్ట్ మేధో ఉత్పాదన’ ఐడియాలో దమ్ముంటే చాలు.... ఒక మంచి కార్టూన్ రూపుదిద్దుకోవ డానికి అనే ఆయన మాటను అరువుగా తీసుకొని ఆయన గీసిన  ఈ కార్టూన్‌ను బహుమంచి కార్టూన్ అనవచ్చు!

>
మరిన్ని వార్తలు