కలబంద... మీ ఇంట్లో ఉందా?

13 Apr, 2014 01:03 IST|Sakshi
కలబంద... మీ ఇంట్లో ఉందా?

టీవీలో అప్పుడప్పుడూ ఓ యాడ్ కనిపిస్తూ ఉంటుంది... సర్వరోగ నివారిణి అంటూ. దాని సంగతేమోగానీ... సర్వరోగ నివారిణి అని చెప్పుకోదగ్గ మొక్క మాత్రం ఒకటుంది... అదే కలబంద (అలొవెరా). బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలో కలబంద ప్రస్తావన ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే నిజానికి అందం కంటే ఆరోగ్యానికి ఇది ఎక్కువ అవసరం. ఎందుకంటే...
 
కలబందలో మినరల్స్, అమైనో యాసిడ్స్, ఎంజైమ్స్, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ, సి, ఇ, బి1, బి2, బి3, బి6, బి12, ఫోలిక్ యాసిడ్ అంటూ దాదారు 200 రకాల ప్రయోజక కారకాలు ఉన్నాయి.
 
కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి.

ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ కూడా. సూక్షక్రిములను అడ్డుకోవడంలో దీన్ని మించింది లేదు.
 
కడుపులో మంట, అజీర్తి, మలబద్దకం వంటి వాటితో పాటు ఆర్థరైటిస్ వల్ల వచ్చే కీళ్ల నొప్పులకు కూడా కలబంద మంచి మందు.

ఇది రక్తాన్ని శుద్ధిపర్చడమే కాదు... రక్తప్రసరణా విధానాన్ని క్రమబద్దీకరిస్తుంది కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే కలబందలో ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు చాలానే ఉన్నాయి. అప్పుడప్పుడూ చిన్న ముక్క నమలడం, వీలైతే రసాన్ని తీసుకుని తాగడం చేస్తే చాలా అనారోగ్యాలు దగ్గరకు రావు. మరో విషయం ఏమిటంటే... దీని రసం దాహార్తిని కూడా తగ్గిస్తుంది. సమ్మర్ వచ్చేసిందిగా... మరి అలొవెరాను కూడా తెచ్చేయండిక!
 

మరిన్ని వార్తలు