వారఫలాలు : 27 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్‌ 2017 వరకు

27 Aug, 2017 00:44 IST|Sakshi
వారఫలాలు : 27 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్‌ 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఒత్తిడులు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామికవర్గాలకు పర్యటనల్లో మార్పులు. ఆరోగ్యభంగం. గులాబి, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోణి, మృగశిర 1,2 పా.)
సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి ఉపశమనం. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఖర్చులు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. కళాకారులకు నూతనోత్సాహం, ఊహించని అవార్డులు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. గులాబి, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఊహకు అందని రీతిలో శత్రువులు మిత్రులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో కుటుంబసమస్యలు. ధనవ్యయం. ఎరుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో  కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు రావచ్చు. కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.  గులాబి, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు యత్నకార్యసిద్ధి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నీలం, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. రియల్‌ఎస్టేట్, ఐటీ రంగాలలోని వారికి విశేషంగా కలిసివస్తుంది. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం రాగలదు. విద్యార్థులకు కొత్త ఆశలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబి, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఓర్పు, నేర్పుతో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. లేత ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కాంట్రాక్టులు పొందుతారు. ఎంతటి వారినైనా వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు రావచ్చు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. నలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
చేపట్టిన పనులు పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల సమాచారం. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. గులాబి, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 

>
మరిన్ని వార్తలు