ఆ ఫౌంటెన్‌ కోసం ఏకంగా రూ. 16 కోట్లు ..! కానీ చివరికి..

17 Dec, 2023 10:05 IST|Sakshi

అప్పుడప్పుడు కొన్ని పనులు మిస్‌ఫైర్‌ అవుతుంటాయి. అలా ఆస్ట్రేలియాలోనూ ఓ సంఘటన జరిగింది. దాదాపు రూ. పదహారు కోట్లు ఖర్చు పెట్టి, అక్కడి ప్రభుత్వం ఒక అందమైన వాటర్‌ ఫౌంటెన్‌ను సిటీ మధ్యలో నెలకొల్పితే.. అదికాస్త ఈ  ప్రపంచంలోనే అత్యంత చెత్త వాటర్‌ ఫౌంటెన్‌గా మారింది. ప్రముఖ ఆర్ట్‌ గ్రూప్‌ ‘గెలిటిన్‌’ డిజైన్‌ చేసిన ఈ ఫౌంటెన్‌.. ఇప్పటి వరకు వారు డిజైన్‌ చేసిన ఆర్ట్‌ వర్క్స్‌ అన్నిటికంటే ఎక్కువ విమర్శలను ఎదుర్కొంది.

‘ప్రచారం చేసినట్లుగా 150 సంవత్సరాల వియన్నా చరిత్ర, ఆధునిక నీటి వ్యవస్థ, నీరు – సామాజిక బాధ్యత.. వంటి విషయాలు ఈ డిజైన్‌లో ఎక్కడ ప్రతిబింబించాయి?’ అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. పైగా ఇందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడాన్నీ తప్పుబడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఫౌంటెన్‌ విపరీతంగా ట్రోల్స్‌ కావడంతో ఈ మధ్యనే గెలిటిన్‌ ‘అందం చూసే వారి కళ్లల్లో ఉంటుంది’ అని స్పందించింది. ‘వారు అన్నమాట నిజమే కానీ, అందాన్ని ఎవరి కళ్లూ చూడలేకపోతే అది చూసేవారి తప్పు కాదుకదా!’ అంటూ పెదవి విరుస్తున్నవారూ లేకపోలేదు.

(చదవండి: అరటిపండుతో తయారు చేసిన సుత్తి! ఎలాగో వింటే షాకవ్వుతారు)

>
మరిన్ని వార్తలు