'కేసీఆర్ తో చంద్రబాబు కాంప్రమైజ్'

17 Feb, 2016 17:15 IST|Sakshi
'కేసీఆర్ తో చంద్రబాబు కాంప్రమైజ్'

హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపాలని గవర్నర్ నరసింహన్ ను కోరామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గవర్నర్ ను కలిసిన అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగు ప్రధాన అంశాలపై గవర్నర్ ను కలిసినట్టు చెప్పారు.

ట్రైబల్ ఎడ్వైజరీ కమిటీ వేయాలని గవర్నర్ ను కోరినట్టు తెలిపారు. తమ పార్టీ వారిపై ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన తప్పుడు కేసుల గురించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకు కేసీఆర్ తో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారని వైఎస్ జగన్ ఆరోపించారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...
'ఈ రోజు గవర్నర్ గారిని నాలుగు ప్రధాన అంశాల మీద కలిసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. కేసీఆర్ గారు టెండర్లు కూడా పిలిచిన నేపథ్యంలో 90 టీఎంసీల నీళ్లు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా డైవర్ట్ అయితే రాయలసీమకు నీళ్లు అందని పరిస్థితి వస్తుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు రావు.ఈ ప్రాజెక్ట్ ను ఆపాలని రిక్వెస్ట్ చేశాం.

ఇదే ప్రాజెక్ట్కు సంబంధించి గతంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి కూడా లేఖ రాశాం. రిక్వెస్ట్ చేశాం. అయినా ఫలితం కనబడలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఈ ప్రాజెక్ట్ను ఆపడానికి కృషి చేయాల్సిన వ్యక్తి ...రాష్ట్రాన్ని పణంగా పెట్టాడు. కనీసం దాని గురించి మాట్లాడని పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారు. ఓటు కోసం కోట్ల రూపాయిలు ఇస్తూ ఆడియో, వీడియో టేప్ల్లో దొరికిపోయారు. ఆ కేసుల నుంచి బయటపడేందుకు కాంప్రమైజ్ అయ్యారు. ఆయన సేఫ్ జోన్లో ఉండటం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారు.

రెండో అంశం: ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కు. రాజ్యాంగం ప్రకారం వేయాల్సిన కమిటీ. ఏడుగురు ట్రైబల్ ఎమ్మెల్యేలు ఉంటే వారిలో ఆరుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ  వేస్తే... చంద్రబాబు నాయుడు చేస్తున్న దౌర్జన్యాలు ఆపేందుకు ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో అడ్వైజరీ కమిటీ వేయడం లేదు. ఈ అంశంపై గతంలో గవర్నర్కు లేఖ ఇచ్చాం. మరోసారి ట్రైబ్స్ అడ్వైజరీ కమిటీ వేయాలని గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చాం.

మూడోది: కాపు గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన సంఘటనలను చంద్రబాబు నాయుడు ఏవిధంగా తప్పుదోవ పట్టించారో గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాం. తన తప్పులు తప్పించుకోనేందుకు తప్పదోవ పట్టించే విధంగా చేస్తున్నారనేది వివరించాం. ఆరోజు జరిగిందేమిటీ అన్నది ప్రతి ఒక్కరూ చూశాం. ముద్రగడ పద్మనాభం కాపు గర్జన సభకు అనుమతి కావాలంటూ జనవరి 31న ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సభకు తమ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లకుండా చంద్రబాబు కట్టడి చేసినా కేడర్ వెళ్లారు.

ఆ మీటింగ్ రైల్వే ట్రాక్ పక్కన జరుగుతుందన్న విషయం అనుమతి ఇచ్చినప్పుడు తెలియదా? ఆ రోజు మీటింగ్ జరిగనప్పుడు ముద్రగడ పద్మనాభం 15 నిమిషాల్లోనే  తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత తనతో కలిసి ప్రజలందరూ బస్సు, రైలు రోకో చేస్తారా అంటే వాళ్లంతా చేస్తామన్నారు. లక్షమంది రైల్వే ట్రాక్ దగ్గరకు వెళితే మాస్ హిస్టీరియా క్రియేట్ అవదా? ఆ విషయాన్ని చంద్రబాబు ఊహించలేదా, ఇంటెలిజెన్స్ ఏమైంది. ఆ జరిగిన ఘటన ఇది అని అందరికీ తెలిసిందే. కానీ తాను పర్మిషన్ ఇచ్చింది తప్పు,  దాని నుంచి తప్పించుకునేందుకు ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు బనాయించారు. ఏం పాపం చేశారని తప్పుడు కేసులు పెట్టారు. ఏ రకంగా ధర్మమిది. నీవు తప్పిదం చేశావు. నువ్వు చేస్తానన్నది చేయనందుకే ఈ ధర్నా జరిగింది. కట్టడి చేయలేకపోవడం నీ రెండో తప్పు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గవర్నర్ కు రిప్రజెంట్ చేశాం. ఈ రకంగా చేయడం అన్యాయం. మాట ఇచ్చి తప్పినందుకు చంద్రబాబుని జైల్లో పెట్టాలి. ఆయనపై కేసులు పెట్టాలని చెప్పడం జరిగింది.

ఇంకో అంశం కూడా గవర్నర్ కి దృష్టికీ తీసుకు వెళ్లాం. గవర్నర్ స్పీచ్లో అన్నీ చేసేశామని చెప్పిస్తున్నారు. ఆ ప్రసంగాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయండి. మీ నోటితో అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా రుణమాఫీ చేశామని చంద్రబాబు సర్కార్ చెప్పించింది. వడ్డీలో నాలుగో వంతు కూడా సరిపోని విధంగా రుణమాఫీ చేసి, మొత్తం రుణమాఫీ చేశామని చెప్పించారు. వడ్డీలు కూడా మాఫీ కానీ పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీ నోటితో  అబద్దాలు చెప్పిస్తున్నారు. అయితే చంద్రబాబు ఇప్పటివరకూ చేసింది కూడా సున్నా. అబద్దాలు చెప్పించినప్పుడు చెప్పద్దు అని, అడగండి అని గవర్నర్తో అన్నాం. చంద్రబాబు హామీల అమలుపై సమగ్ర సమాచారం తెప్పించుకుని, పరిశీలించమని గవర్నర్ను కోరాం' అని తెలిపారు. కాగా, విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ.. స్పీకర్ పై అవిశ్వాసం పెడతామని చెప్పారు.

మరిన్ని వార్తలు