'ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకం'

16 Sep, 2016 19:07 IST|Sakshi

- టీఆర్ఎస్ తీరుపై దత్తాత్రేయ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ

సెప్టెంబరు 17ను విమోదన దినంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అడిగితే మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారనడం అవివేకమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ వర్కర్స్ ఎడ్యుకేషన్ డే కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి అభ్యంతరం ఏమిటి? మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి, ఓట్ల కోసం టీఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబరు 17ను అధికారికంగా నిర్వహించడం లేదు. కొమరం భీమ్, చాకలి ఐలమ్మ, షోయబుల్లాఖాన్ నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. వారందరినీ స్మరించుకోవాలి..’ అని పేర్కొన్నారు. మూడేళ్లలో కోటి మంది కార్మికులకు శిక్షణ ఇస్తామని, కార్మిక శాఖ పథకాలపై వారిలో చైతన్యం పెంచుతామని తెలిపారు. అసంఘటిత కార్మికులకు బోనస్ పెంచామని వివరించారు.

 

మరిన్ని వార్తలు