కరువు అంచనాకు... టీ టీడీపీ బృందాలు

17 Apr, 2016 01:31 IST|Sakshi

18 నుంచి 25వరకు కరువు యాత్రలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అంచనాకు వచ్చేందుకు ఈ నెల 18 నుంచి 25 వరకు టీటీడీపీ బృందాలు కరువు యాత్రలు చేపడుతున్నట్లు టీటీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపా రు. శనివారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి తాజుద్దీన్‌తో కలసి విలేక రులతో మాట్లాడారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులుంటారని, స్థానికంగానే నివేదికలు తయారు చేసి కలెక్టర్లకు అందజేస్తామన్నారు. ఈనెల 25 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ ఎంపీలు కరువుపై ప్రస్తావించడంతో పాటు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి నివేదికిస్తామన్నారు.

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతున్నారని రావుల విమర్శించారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే మద్యం కంపెనీలకు మాత్రం నీళ్లు సరఫరా చేస్తున్నారన్నారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామన్న హామీ మరిచిపోయారన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన 4శాతం రిజర్వేషన్లను కూడా కాపాడటం లేదన్నారు.

మరిన్ని వార్తలు