‘ప్రతివాదిగా రాష్ట్రపతి’పై వైఖరి చెప్పండి

28 Feb, 2017 03:01 IST|Sakshi
‘ప్రతివాదిగా రాష్ట్రపతి’పై వైఖరి చెప్పండి

హెచ్‌సీయూ వ్యాజ్యంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు) వైస్‌ చాన్సలర్‌గా అప్పారావు తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ అనుమతివ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంలో రాష్ట్రపతిని ప్రతివాదిగా చేర్చే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్రాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

అప్పారావు బాధ్యతలు చేపట్టేందుకు మానవ వనరుల శాఖ అనుమతిని సవాలు చేస్తూ, ఆయన్ను మరో చోటుకు బదిలీ చేయడంతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుండా హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత వి.హన్మంతరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు