నగరం నుంచి 1,160 పరిశ్రమల తరలింపు

21 Dec, 2016 00:28 IST|Sakshi
నగరం నుంచి 1,160 పరిశ్రమల తరలింపు

పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం నుంచి కాలు ష్యకారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌ రోడ్డుకు అవతలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తెలిపారు. నగరం లో 1,545 పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని పీసీబీ గుర్తించిందని, అందులో 385 పరిశ్రమలు ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ బయట ప్రాంతం లో ఉన్నాయన్నారు. మిగిలిన 1,160 పరిశ్రమలను హైదరాబాద్‌ ఫార్మా సిటీ ప్రాంతానికి తరలించాలనే ప్రతి పాదన ఉందని పేర్కొన్నారు.

కాలుష్య కారక పరిశ్రమల తరలింపుపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నగరం నుంచి పరిశ్రమల తరలింపు కోసం ఓఆర్‌ఆర్‌కు 100 కి.మీ.ల పరిధిలో  పలుచోట్ల స్థలాలను టీఎస్‌ఐఐసీ గుర్తించిందని వెల్లడించారు. తర లింపు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు