ఏపీ తరహాలో ‘వైద్య’ ఫీజుల పెంపు!

26 Jul, 2016 02:59 IST|Sakshi

- నేడు, రేపు ఏఎఫ్‌ఆర్‌సీ భేటీ
 సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల ఫీజు పెంపునకు రంగం సిద్ధమైంది. ఏపీలో ఉన్నట్లుగానే తెలంగాణలోనూ ఫీజులు పెరిగే అవకాశం ఉందని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఫీజును నిర్ధరించేందుకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) మంగళ, బుధవారాల్లో ప్రత్యేకంగా ప్రైవే టు మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో భేటీ కానుంది. అనంతరం ప్రభుత్వం ఫీజుల పెంపును ప్రకటించనుంది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం బీ కేటగిరీ ఎంబీ బీఎస్ సీటు ఫీజు ఏడాదికి రూ. 9 లక్షలుం డగా... ఆ ఫీజును ఏపీ మాదిరిగా రూ. 11 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అలాగే సీ కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) ఫీజు ప్రస్తుతం రూ. 11 లక్షలు ఉంది. ఏపీలో ఈ కేటగిరీ ఫీజును బీ కేటగిరీ ఫీజుకు 5 రెట్ల వరకు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. తెలంగాణలోనూ ఆ వెసులుబాటు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు