కరోనా టెస్టులను వ్యాపారంగా చూడొద్దు

23 Jun, 2020 14:18 IST|Sakshi

డయాగ్నొస్టిక్స్ కు మంత్రి ఈటల సూచన

సాక్షి, హైదరాబాద్: కరోనా పరీక్షలను వ్యాపార కోణంలో చూడొద్దని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ డయాగ్నొస్టిక్స్ ప్రతినిధులకు సూచించారు. సాధారణ పరీక్షలకు, కరోనా టెస్టులకు చాలా తేడా ఉందని చెప్పారు. వీటిలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీటింగ్ విధానాలు ఇమిడి ఉన్నాయని తెలిపారు. కరోనా పరీక్షలు చేస్తున్న డయాగ్నొస్టిక్స్ ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, ఇంటికి వెళ్లి పరీక్షలు చేయొద్దని చెప్పారు. విమానాల్లో వచ్చిన వారికి లక్షణాలు లేకపోయినా టెస్టులు చేయాలని సూచించారు. (ఆర్మీ జవాన్‌ తల్లిపై దాడి)

టెస్టులు చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు పీపీఈ కిట్లను తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. లేదంటే వారి ద్వారా కరోనా మిగిలిన వారికి అంటుతుందని హెచ్చరించారు. ఐసీఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా టెస్టులు చేయాలని కోరారు. (డేంజర్‌ బెల్స్‌ !)

మరిన్ని వార్తలు