ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20న

26 Feb, 2017 02:28 IST|Sakshi
ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 20న

షెడ్యూల్‌లో మార్పులు చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌లో పలు మార్పులు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ శనివారం నిర్ణయం తీసుకుంది. మార్చి 17 న జరగాల్సిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చి 20కు మార్చింది. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌ నిర్వహిస్తామని తెలిపింది.

అదే విధంగా మార్చి 15న జరగాల్సిన రెండు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను మార్చి 20కు వాయిదా వేసింది.
( చదవండి : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల )
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు