ఎంఆర్ వ్యాక్సిన్ ను ప్రారంభించిన ల‌క్ష్మారెడ్డి

17 Aug, 2017 15:15 IST|Sakshi
హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి తట్టు (మీజిల్స్), రూబెల్లా వ్యాధుల నివారణ కోసం చిన్నారులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా న‌గ‌రంలోని రాజ్ భ‌వ‌న్ స్కూల్ లో ఎంఆర్ వ్యాక్సిన్ ను వైద‍్యఆరోగ‍్య శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... 9 నెల‌ల నుంచి 15 ఏళ్ల వ‌య‌సు వారికి ఈ టీకా వేయించాలని తెలిపారు. ఇప‍్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ వ్యాక్సిన్ వేశార‌న్నారు.
 
రాష్ట్రంలో 90 ల‌క్షల మంది పిల‍్లల‌కు టీకాలు వేయాల‌ని నిర‍్ణయించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. స్కూళ‍్లలో 60 ల‌క్షల మంది పిల‍్లలు ఉన‍్నట్లు ఆయ‌న చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహ‌లు లేకుండా ఈ కార‍్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 5 వారాల పాటు ఈ వ్యాక్సిన్ వేయ‌నున‍్నట్లు ఆయ‌న తెలియ‌జేశారు. రెగ్యుల‌ర్ వ్యాక్సిన్ తో పాటు ఎంఆర్ కూడా తీసుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.
మరిన్ని వార్తలు