అవినీతి నిరోధక బిల్లు చట్ట సవరణ కోసం పోరాడాలి

18 Dec, 2016 02:51 IST|Sakshi
అవినీతి నిరోధక బిల్లు చట్ట సవరణ కోసం పోరాడాలి

కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ప్రభుత్వ అవినీతి నిరోధక చట్ట సవరణ బిల్లుకు అధికారికంగా ఆమోదించిన సవరణలు అవినీతిపరులను రక్షించేలా, లంచాల బాధితులైన సామాన్య ప్రజలను శిక్షించేలా ఉన్నాయని కేంద్ర సమాచార హక్కు కమిషనర్‌ డా.మాడభూషి శ్రీధర్‌ అన్నారు. వీటిని సరిదిద్దే వరకు ప్రజా ప్రతినిధులు, సంఘాలు, ప్రజలు పార్టీల కతీతంగా పోరాటం చేయాలన్నారు. శనివారం లోక్‌సత్తా  కేంద్ర కార్యాలయంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమా వేశంలో శ్రీధర్‌ మాట్లాడుతూ అవినీతి నిరోధక చట్టానికి ప్రస్తుతం చేసిన సెక్షన్‌ 8 సవరణ లంచాల బాధి తులైన ప్రజలనే శిక్షించేలా ఉందన్నారు.

లంచం తీసుకోవడం ఎంత నేరమో, ఇవ్వడమూ అంతే నేరమన్న సహజ సూత్రాన్ని లంచాలిచ్చే వారికి వర్తింప చేస్తారు కాని హక్కుగా రావాల్సిన సేవలకు లంచాలివ్వాల్సి వచ్చే సామాన్యులకు వర్తింపచేస్తారా అని ప్రశ్నించారు. సమావేశంలో లోక్‌సత్తా కన్వీనర్‌ బండారు రామ్మోహనరావు  లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డా.పాండురంగారావు, ఆమ్‌ ఆద్మీ నాయ కుడు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు