దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!

23 Jan, 2016 10:33 IST|Sakshi
దీని ‘దుంప’తెగ.. ఏం రేటు!!

ఈ బంగాళదుంప ఫొటోను చూస్తే సాదాసీదాగా కనిపిస్తోంది కదూ. కానీ ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫొటోల్లో ఒకటి. దీన్ని గతేడాది 10 లక్షల డాలర్లకు విక్రయించారు. కెవిన్ అబోస్ అనే ఫొటో గ్రాఫర్ దీన్ని చిత్రీకరించారు. ఆయన సిలికాన్ వ్యాలీ టెక్‌లోని ప్రముఖ వ్యాపారులకు ఫొటో షూట్ తీసి భారీ మొత్తంలో వసూలు చేస్తుంటాడు. ఒక ఫొటో షూట్ కోసం లక్షా 50 వేల డాలర్ల నుంచి అత్యధికంగా 5 లక్షల డాలర్ల వరకు తీసుకుంటాడు.
 
ఇతనిలో దీంతో పాటు ఫైన్ ఆర్ట్ ఫొటో గ్రాఫర్(లలిత కళా ఛాయాకారుడు) కూడా దాగి ఉన్నాడు. దాని మూలంగానే ఈ ఫొటో రూపుదిద్దుకుంది. ఎన్ని రకాలుగా ఉన్నా మనుషులుగా గుర్తించవచ్చని.. అలాగే బంగాళదుంపలను కూడా అని.. అందుకే తనకు ఇవి ఇష్టమని ఆయన తెలిపాడు. కాగా, ఇలాంటి ఫొటోలను సేకరించే పీటర్ అనే ఒక సంపన్న వ్యక్తి 2015లో కెవిన్ ఇంటిని సందర్శించినప్పుడు ఈ బంగాళ దుంప ఫొటోను కొనుగోలు చేశాడు.   ప్రస్తుతం టాప్ 20 అత్యంత విలువైన ప్రారంభ కొనుగోలు ధరల్లో దీనికి చోటు లభించింది.    
 - పారిస్

మరిన్ని వార్తలు