క్రియాశీల విదేశాంగం..!

29 Dec, 2014 01:01 IST|Sakshi
అమెరికాలోని మేడిసన్ స్క్వేర్‌లో ప్రసంగిస్తున్న మోదీ (ఫైల్)

 నేషనల్ డెస్క్: ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే విదేశాంగ విధానంలో మోదీ తొలి అడుగు వేశారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి దాయాది దేశం పాకిస్తాన్ సహా సార్క్ దేశాధినేతలను ఆహ్వానించి కొత్త ఒరవడికి తెరదీశారు. మోదీ విదేశాంగ విధానంపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అత్యంత క్రియాశీల విదేశాంగ విధానానికి రూపకల్పన చేశారు. ఇరుగుపొరుగు దేశాలతో సత్సంబంధాలకు పెద్ద పీట వేస్తూ.. ప్రధానిగా తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంచుకున్నారు. ఆ తరువాత బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లారు. అనంతరం నేపాల్‌లో పర్యటించారు. ఆగస్ట్ 30న ఐదు రోజుల పర్యటనకు జపాన్ వెళ్లి, ద్వైపాక్షికాంశాల్లో, ఆర్థిక సహకారంలో ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. చైనా అధ్యక్షుడు గ్జి జిన్‌పింగ్ భారత పర్యటన మోదీ విదేశాంగ విజయాల్లో కీలకం. ఆ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. సెప్టెంబర్ చివరలో అమెరికాలో పర్యటించారు. ఒబామాతో చర్చలు, ఐరాస సర్వ ప్రతినిధి సభలో ప్రసంగం, న్యూయార్క్‌లోని మేడిసన్ స్క్వేర్‌లో భారీగా హాజరైన భారతీయ అమెరికన్లనుద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగం.. మొదలైన వాటితో అమెరికా పర్యటనను విజయవంతం చేశారు. నవంబర్ 11వ తేదీ నుంచి పది రోజుల పాటు మయన్మార్, ఆస్ట్రేలియా, ఫిజీల్లో పర్యటించారు. అందులో భాగంగా మయన్మార్‌లో తూర్పు ఆసియా సదస్సులో, ఆస్ట్రేలియాలో జీ 20 సదస్సులో పాల్గొన్నారు. సిడ్నీలోని అల్ఫోన్స్ ఎరీనాలో 16 వేలమంది భారతీయ ఆస్ట్రేలియన్లనుద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.

అనంతరం నవంబర్ 25 నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో సార్క్ సదస్సులో పాల్గొన్నారు. డిసెంబర్ 11న భారత చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. మోదీతో చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య రక్షణ సహకారం సహా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. మొత్తంమీద భారత్‌ను ఒక కీలక శక్తిగా, అంతర్జాతీయ పరిణామాల్లో విస్మరించలేని దేశంగా, పరస్పర సహకారంలో మిత్రదేశంగా ప్రపంచ పటంపై నిలిపారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆరునెలల్లో మోదీ 8 దేశాలను చుట్టివచ్చారు.

 పాక్, చైనాల కవ్వింపులు
 మోదీ విదేశీ పర్యటనలపై విమర్శలూ వెల్లువెత్తాయి. ఆపర్యటనలు మోదీకి ప్రచారానికి ఉ పయోగపడ్డాయే కానీ వాస్తవ ఫలితాలేం లేవ న్న విమర్శలు వచ్చాయి. దేశంలోని అంతర్గత సమస్యలను గాలికొదిలి.. గాల్లోనే చక్కర్లు కొ డుతున్నారని, జమ్మూకశ్మీర్ ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. అమెరికా పర్యటనకు వెళ్లారని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి.

Election 2024

మరిన్ని వార్తలు
Greenmark Developers